Begin typing your search above and press return to search.

ఫౌజీ అప్పుడొస్తే.. మరి స్పిరిట్ ఎప్పుడు?

ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కోసం ఆయన ఇంకా దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట.

By:  M Prashanth   |   9 Oct 2026 5:00 PM IST
ఫౌజీ అప్పుడొస్తే.. మరి స్పిరిట్ ఎప్పుడు?
X

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ఇప్పుడు భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ కాగా.. మరొకటి సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న స్పిరిట్. ఆ రెండు సినిమాలపై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే వీటి రిలీజ్ డేట్స్ విషయంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. ఫౌజీ ముందుగా వస్తుందా, స్పిరిట్ అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కోసం ఆయన ఇంకా దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట. డిసెంబర్ మొదటి వారానికి తన షూటింగ్‌ పార్ట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న టీజర్ విడుదల కానుందనే ప్రచారం అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ఆ టీజర్‌ తో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఫౌజీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ రెండో వారం నుంచి ఆ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

దాదాపు రెండు నెలల పాటు వరుస షెడ్యూల్స్‌ లో పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. ప్రభాస్‌ ను ఎలా చూపించబోతున్నారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ కాంబినేషన్‌ పై అంచనాలు భారీగా ఉండటంతో సినిమా షూటింగ్, విడుదలపై అభిమానులు దృష్టి పెట్టారు. స్పిరిట్‌ ను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

మరోవైపు, ఫౌజీని 2027 మార్చి 18వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఫౌజీ విడుదల తేదీపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఆ రెండు డేట్స్ ఫిక్స్ అయితే ఒకే నెలలో ప్రభాస్ నటించిన రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. అయితే ఒకే నెలలో రెండు భారీ సినిమాలు విడుదలైతే వాటి వసూళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

అందుకే విడుదల తేదీలను ఫిక్స్ చేసేటప్పుడు మూవీ టీమ్స్ మార్కెట్ పరిస్థితులను కూడా లెక్కలోకి తీసుకుంటాయి. అందుకే ఫౌజీ కోసం స్పిరిట్ విడుదల తేదీని మార్చే అవకాశముందనే ప్రచారం మొదలైంది. ఆగస్టు లేదా అక్టోబర్ 2027లో స్పిరిట్‌ ను విడుదల చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ, ఆ పోస్ట్ పోన్ వార్తలపై మేకర్స్ నుంచి అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ టీజర్‌ తో పాటు ఇతర అప్డేట్స్ వస్తే రిలీజ్ డేట్లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.