Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'స్పిరిట్'.. మైథాలజీనా? హాలీవుడ్ ఇన్స్పిరేషనా?

అదే సమయంలో పోస్టర్ కేవలం కథలోని మెయిన్ ఫీలింగ్ ను సూచించే ఒక విజువల్ రిఫరెన్స్ మాత్రమే అని, దానిని పూర్తిగా కాపీ లేదా ఇన్స్పిరేషన్‌ గా అప్పుడే అనుకోవడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

By:  M Prashanth   |   2 Jan 2026 3:58 PM IST
ప్రభాస్ స్పిరిట్.. మైథాలజీనా? హాలీవుడ్ ఇన్స్పిరేషనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఓ రేంజ్ లో వాటిని పెంచేసింది. అందరినీ తెగ ఆకట్టుకున్న పోస్టర్.. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అనే నమ్మకాన్ని ఏర్పరిచింది.

అంతే కాదు.. పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దానిపై ఫుల్ గా చర్చ సాగుతోంది. పోస్టర్‌ లోని విజువల్ కాన్సెప్ట్‌ పై అభిమానులు, నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. తమ అభిప్రాయాలను పోస్టుల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు వర్గాలుగా విడిపోయి.. స్పిరిట్ కొత్త పోస్టర్ పై స్పందిస్తూ ఒపీనియన్స్ చెబుతున్నారు.

పోస్టర్‌ లో అర్థనారీశ్వర తత్వం క్లియర్ గా కనిపిస్తుందని కొందరు చెబుతున్నారు. శివుడు, పార్వతి దేవి ఏకమై ఉన్న రూపమే అర్ధనారీశ్వరుడు. అందుకే హీరో హీరోయిన్ల ఎనర్జీలు, ఎమోషన్స్ మిక్సింగ్ ను పోస్టర్ చూపిస్తుందని అంటున్నారు. అందుకే స్పిరిట్ అనే టైటిల్ అని పెట్టారని.. దాన్ని అర్థం అందుకు సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇంకొందరు మాత్రం స్పిరిట్ పోస్టర్‌ హాలీవుడ్ సినిమా బేసిక్ ఇన్‌ స్టింక్ట్ (1992) పోస్టర్‌ ను గుర్తుకు తెస్తోందని చెబుతున్నారు. మైఖేల్ డగ్లస్, షారన్ స్టోన్ నటించిన ఆ సినిమా పోస్టర్‌ లో ఉన్న లేఅవుట్, బాడీ లాంగ్వేజ్, సెన్సువల్ అండర్‌ టోన్‌ తో స్పిరిట్ పోస్టర్ కు పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. బోల్డ్ టేక్‌, రా ఎమోషన్స్‌ను చూపించడంతో.. సందీప్ వంగా హాలీవుడ్ మూవీని ఇన్‌ స్పిరేషన్ గా తీసుకున్నారని అనుమానపడుతున్నారు.

అదే సమయంలో పోస్టర్ కేవలం కథలోని మెయిన్ ఫీలింగ్ ను సూచించే ఒక విజువల్ రిఫరెన్స్ మాత్రమే అని, దానిని పూర్తిగా కాపీ లేదా ఇన్స్పిరేషన్‌ గా అప్పుడే అనుకోవడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. వంగా రాసుకున్న సినిమా కథ, క్యారెక్టరైజేషన్, ప్లానింగ్ బయటకు వచ్చిన తర్వాత నిజమైన ఉద్దేశం అర్థమవుతుందని అంటున్నారు.

అది నిజమనే చెప్పాలి.. ఎందుకంటే సినిమా ఇప్పుడు ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. సందీప్ రెడ్డి వంగా తనదైన ప్లాన్ తో చిత్రీకరణను నిర్వహిస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ వర్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్ లో వర్క్ చేస్తున్నారు.

ప్రభాస్ ను కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ పోలీస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. కాబట్టి స్పిరిట్ పోస్టర్‌ మైథాలజీతో తీస్తున్నట్లు సిగ్నలా? లేక హాలీవుడ్ ఇన్స్పిరేషన్ తో మోడ్రన్ మూవీ చేస్తున్న సంకేతమా? అన్నది ఇంకా ఎవరూ చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం నిజం.. పోస్టర్ సినిమాపై భారీగా ఆసక్తిని క్రియేట్ చేసింది. అందరి ఫోకస్ ను సినిమా వైపు తిప్పేసింది.