Begin typing your search above and press return to search.

స్పిరిట్ OTT డీల్.. అసలు నమ్మేలా ఉందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో డార్లింగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

By:  M Prashanth   |   2 Dec 2025 6:24 PM IST
స్పిరిట్ OTT డీల్.. అసలు నమ్మేలా ఉందా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో డార్లింగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరగ్గా.. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు మేకర్స్.

అయితే మొన్న మొన్ననే షూటింగ్ మొదలవ్వగా.. స్పిరిట్ ఓటీటీ డీల్ పూర్తి అయినట్లు రీసెంట్ గా టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. స్పిరిట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రూ.160 కోట్లకు లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డీల్ అఫీషియల్ గానే ముగించుకున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ఆ విషయం వైరల్ గా మారగా.. స్పిరిట్ సినిమా ఓటీటీ డీల్ వాల్యూ తక్కువనేని అని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ లో మాత్రం మంచి రేటే అని మరికొందరు అంటున్నారు. ఇప్పుడు ఉన్న ఓటీటీ పరిస్థితుల్లో తక్కువేం కాదని కామెంట్లు పెడుతున్నారు. కానీ అసలు ఓటీటీ డీల్ లో నిజం లేదని ఇంకొందరు చెబుతున్నారు.

ఎందుకంటే స్పిరిట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓవైపు ప్రభాస్ యాక్ట్ చేస్తుండడం.. మరోవైపు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తుండడంతో ఓ రేంజ్ లో హోప్స్ ఉన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంతా ఫిక్స్ అయిపోయారు.

అలాంటి అంచనాలు ఉన్న మూవీకి రూ.160 కోట్ల ఓటీటీ డీల్ ఖరారు అయిందంటే నమ్మలేకపోతున్నామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓ విధంగా అది కూడా నిజమే... రీసెంట్ గా వచ్చిన కొన్ని భారీ చిత్రాలకు పెద్ద మొత్తంలో డీల్స్ ఖరారు అయ్యాయి. ఓటీటీ ఒప్పందాలతోనే మేకర్స్ కు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి.

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ కేవలం హిందీ ఓటీటీ రైట్సే రూ.170 కోట్లకు పైగా రేట్ తో అమ్ముడయ్యాయి. అలాంటిది స్పిరిట్ మూవీకి మొత్తం డీల్ రూ.160 కోట్లకు ఖరారు అవ్వడమంటే నమ్మేలా లేదని కామెంట్లు పెడుతున్నారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని, నిజం కాదేమోనని చెబుతున్నారు. ఏదేమైనా స్పిరిట్ ఓటీటీ డీల్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏమైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.