చుక్కల్లో ప్రభాస్ స్పిరిట్ డిజిటల్ డీల్
సందీప్ వంగా ఇంటెన్స్ కాప్ డ్రామా స్పిరిట్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ ఈ చిత్రంలో సీరియస్ కాప్ పాత్రలో నటిస్తున్నారు.
By: Sivaji Kontham | 30 Nov 2025 11:33 PM ISTసందీప్ వంగా ఇంటెన్స్ కాప్ డ్రామా స్పిరిట్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ ఈ చిత్రంలో సీరియస్ కాప్ పాత్రలో నటిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కేటగిరీలో సందీప్ మార్క్ ఎమోషనల్ డెప్త్ తో కొనసాగే చిత్రమని కథనాలొస్తున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ తరహాలో ఇంటెన్స్ సీన్లకు ఈ చిత్రంలో కూడా కొదవేమీ ఉండదు. అంతటి డెప్త్ ఉన్న పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. పోలీసాఫీసర్ జీవితంలో ఎమోషనల్ డ్రామా ఇందులో హైలైట్ గా ఉండనుంది. ఇందులో కూడా అనీల్ కపూర్ నటించే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్- సందీప్ వంగా కలయికలోని ఈ చిత్రాన్ని టి- సిరీస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ ని ఢీకొట్టే కంటెంట్ తో రూపొందుతోందని, బడ్జెట్ కూడా అసాధారణంగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాల దృష్ట్యా ఇప్పటికే డిజిటల్ రైట్స్ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. పాపులర్ ఓటీటీ అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ.160కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం.
అరుదైన ట్రాక్ రికార్డ్...
సందీప్ వంగాకు ఒక అరుదైన ట్రాక్ రికార్డ్ ఉంది. విజయ్ దేవరకొండ లాంటి రైజింగ్ స్టార్ తో సందీప్ వంగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా మలిచాడు. షాహిద్ కపూర్ (కబీర్ సింగ్), రణబీర్ కపూర్ (యానిమల్) లాంటి టాప్ హీరోలను ఎమోషనల్ డెప్త్ ఉన్న కంటెంట్ తో సందీప్ రెడ్డి హై పిచ్ కి తీసుకుని వెళ్లాడు. సందీప్ వంగాతో పని చేసాకే ఆ హీరోల రేంజ్ మరింత పెరిగింది. ఇమేజ్ అమాంతం మారిపోయింది. ఇప్పుడు అదే అంశం వంగాపై అంచనాలను పెంచుతోంది. అతడు ప్రభాస్ పాత్రను ఏ విధంగా తీర్చిదిద్దాడు? యాక్షన్ డ్రామాలో కాప్ పాత్రను ఏ రేంజుకు చేర్చుతాడు? అన్నది ఉత్కంఠగా మారింది. సందీప్ తో పని చేసిన హీరోలందరికీ ఇప్పటివరకూ గొప్ప పేరొచ్చింది. ఇప్పుడు ప్రభాస్ లాంటి మ్యాసివ్ ఫాలోయింగ్ ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ని ఎలా చూపించబోతున్నాడు? అన్నది ఉత్కంఠగా మారింది.
రణబీర్ కపూర్ `యానిమల్`ని పోస్టర్, టీజర్, ట్రైలర్ దశలోనే పరాకాష్ఠకు తీసుకెళ్లాడు. రణబీర్ ని ఏదో కొత్తగా చూపిస్తున్నాడనే ఫీలింగ్ ని కలగజేయడంలో అతడు విఫలం కాలేదు. అప్పటివరకూ రెగ్యులర్ చాక్లెట్ బోయ్ లాగా కనిపించిన రణబీర్ ని యాక్షన్ హీరోగా, ఒక రెబల్ గా చూపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ప్రభాస్ ని కూడా అందరూ ఆశ్చర్యపోయేలా అతడు తెరపై ఎలివేట్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి. ఆశ్చర్యపోయేలా, ఉత్కంఠ పెంచేలా, ఇదీ కొత్తదనం అని చెప్పుకునేలా సందీప్ వంగా ఏం చేస్తాడు? అన్నదే వేచి చూడాలి. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైంది. 2027 ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేయాలనేది ప్లాన్. ప్రభాస్, ట్రిప్తి దిమ్రీ కాకుండా ఇతర నటీనటులు ఎవరు అనేది తేలాల్సి ఉంది.
