Begin typing your search above and press return to search.

స్పిరిట్ పై కొత్త ప్రచారం.. ప్రభాస్తో సందీప్ ఆ జానర్ సినిమా తీస్తున్నారా?

ప్రభాస్ హీరోగా సందీప్ స్పిరిట్ సినిమాను భయానకమైన హార్రర్ థ్రిల్లర్ గా రూపొందించనున్నారని.. ఇది అచ్చం ఎమ్ నైట్ శ్యామలన్ సినిమాలను పోలి ఉంటుందని రిపోర్ట్ లో పేర్కొంది.

By:  M Prashanth   |   4 Sept 2025 8:15 AM IST
స్పిరిట్ పై కొత్త ప్రచారం.. ప్రభాస్తో సందీప్ ఆ జానర్ సినిమా తీస్తున్నారా?
X

రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ ఎక్కువ మంచి వెయిట్ చేస్తుంది మాత్రం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసమే. ఈ సినిమా ఎప్పుడో కన్ఫార్మ్ అయినప్పటికీ.. ఇంకా పట్టాలెక్కలేదు. ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ లతో హీజీగా ఉండడంతో స్పిరిట్ ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా పెండింగ్ పాటల షూటింగ్ కోసం గ్రీస్ వెళ్లనున్నారు.

ఈ షూటింగ్ పూర్తైన తర్వాత ఆయన స్పిరిట్ కు ఫుల్ టైమ్ కేటాయించనున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుందని డైరెక్టర్ సందీప్ ఇప్పటికే చెప్పినా.. ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలో హిందీ మీడియాలో స్పిరిట్ జానర్, కథాంశంపై పలు ఆసక్తికర కథనాలు బయటకు వచ్చాయి. బాలీవుడ్ సినీ ప్రముఖ వెబ్ సైట్ హంగామా తన నివేదికలో ప్రభాస్ స్పిరిట్ గురించి రాసుకొచ్చింది.

ప్రభాస్ హీరోగా సందీప్ స్పిరిట్ సినిమాను భయానకమైన హార్రర్ థ్రిల్లర్ గా రూపొందించనున్నారని.. ఇది అచ్చం ఎమ్ నైట్ శ్యామలన్ సినిమాలను పోలి ఉంటుందని రిపోర్ట్ లో పేర్కొంది. అయితే మొదట్నుంచి స్పిరిట్ పవర్ ఫుల్ పోలీసు కథ అని.. ఇందులో డార్లింగ్ పోలీసు పాత్ర చేయనున్నారని ప్రచారం సాగింది. ఇదో ఇంటర్నేషనల్ సిండికేట్ జానర్ లో తెరకెక్కుతుందని తెలిసింది. కానీ, తాజా రిపోర్ట్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది.

దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆల్రేడీ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చేస్తున్నారు. ఇది కామెడీ హర్రర్ జానర్ లోనే తెరకెక్కుుతుంది. అలాంటింది బ్యాక్ టు బ్యాక్ రెండు ఒకే జానర్ సినిమాలు ఎందుకు చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ స్టోరీపై గతంలోనే దర్శకుడు సందీప్ చెప్పారు. ఇది శక్తిమంతమైన పోలీసు కథ అని అన్నారు. కానీ, లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడంతో ఫ్యాన్స్ చిన్న కన్ ఫ్యూజన్ లో పడ్డారు.

కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటించనుంది. ఇటీవలే ఆమెను ఎంపికచేస్తూ.. మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఇర భద్రకాళీ, టీ సిరీస్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక షూటింగ్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.