డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న త్రిప్తి కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 1 July 2026 3:06 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, తాజాగా హీరోయిన్ త్రిప్తి దిమ్రీ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచాయి. సినిమా గురించి ఆమె చెప్పిన దాని కంటే, చెప్పకుండా దాచిపెట్టిన విషయాలే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ గురించి మాట్లాడిన త్రిప్తి, ఈ సినిమా తనకెంతో ప్రత్యేక అనుభవంగా ఉండబోతోందని చెప్పింది. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడే వెల్లడించే సమయం రాలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి స్పిరిట్ సినిమా గురించి ఎక్కువ విషయాలు చెప్పలేనని, సరైన సమయంలో ప్రేక్షకులు చూసినప్పుడు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానంటూ ఆమె చేసిన కామెంట్స్ సినిమా చుట్టూ ఉన్న సస్పెన్స్‌ను మరింత పెంచాయి.
సాధారణంగా భారీ సినిమాల విషయంలో కథ, పాత్రలు లేదా కీలక అంశాలకు సంబంధించిన చిన్నచిన్న లీక్స్ కూడా బయటకు వస్తుంటాయి. కానీ స్పిరిట్ విషయంలో మాత్రం టీమ్ మొదటి నుంచే పూర్తి గోప్యతను పాటిస్తోంది. త్రిప్తి తాజా కామెంట్స్ కూడా అదే వ్యూహాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమా గురించి ఆసక్తిని తగ్గించకుండా, ఒక్కో అప్డేట్‌తో హైప్‌ను పెంచాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకం కావడానికి మరో కారణం కూడా ఉంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ మొదటిసారి జతకట్టడం ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనదైన మార్క్ చూపించిన సందీప్, ప్రభాస్‌ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి ఇప్పటికే పీక్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నుంచి వచ్చిన చిన్న హింట్ కూడా అభిమానుల్లో కొత్త డిస్కషన్ కు దారితీసింది.
అలాగే ప్రభాస్- త్రిప్తి డిమ్రీ జోడీ కూడా పూర్తిగా కొత్తది కావడం విశేషం. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ తర్వాత మరోసారి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న త్రిప్తి, ఈ ప్రాజెక్ట్‌పై వ్యక్తం చేసిన నమ్మకం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. భారీ తారాగణం కూడా స్పిరిట్‌కు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వివేక్ ఒబెరాయ్ స్పిరిట్ లో విలన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య దేశాయ్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతోంది. ప్రస్తుతం త్రిప్తి చేసిన ఒక్క కామెంట్ తోనే స్పిరిట్ మరోసారి వార్తల్లో నిలిచింది. కథ గురించి ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా సస్పెన్స్‌ను కొనసాగించడమే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మారినట్లు కనిపిస్తోంది.
