స్పిరిట్ : ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చూడగలరా..?
ప్రభాస్ ఫ్యాన్స్‌లో అన్ని వర్గాల వారు ఉంటారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారు, మహిళలు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రభాస్‌కి మంచి క్రేజ్ ఉంది.
By: Ramesh Palla | 19 Jun 2026 12:43 PM ISTబాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్టార్‌డం అమాంతం పెరిగిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్ సక్సెస్.. ఫ్లాప్... లతో సంబంధం లేకుండా తన స్టార్‌డంను మరింతగా పెంచుకుంటూ ఆకాశమే హద్దు అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ తదుపరి సినిమా సందీప్ రెడ్డి వంగతో కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో 'స్పిరిట్' మూవీ రూపొందుతున్న విషయం తెల్సిందే. సినిమాలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అంతే కాకుండా సందీప్ రెడ్డి గత చిత్రాలతో పోల్చితే ఇంకాస్త అడల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉండబోతుందని అంటున్నారు. యానిమల్ సినిమాలో ఏ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉన్నాయో తెలిసిందే. ఇందులోనూ అంతకు మించి ఉంటాయని అంటున్నారు.
ధురంధర్ 2 సినిమాలోని యాక్షన్ సీన్స్...
ధురంధర్ సినిమాలోని యాక్షన్ సీన్స్ విషయమై విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ధురంధర్ 2 సినిమాలోని యాక్షన్ సీన్స్ ను పెద్ద వారు సైతం చూడ్డానికి ఇబ్బందిగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ధురంధర్ యాక్షన్ సీన్స్‌ను మించి స్పిరిట్‌లో యాక్షన్ సీన్స్ ను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. సందీప్ సినిమా అంటే ఎలాగూ ఎ సర్టిఫికెట్ కన్ఫర్మ్. అయినా అంతకు మించి అంటే సెన్సార్ నుంచి ఎలాంటి అడ్డంకులు వస్తాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన్ను గతంలో ఫ్యాన్స్ ఎప్పుడూ చూడని విధంగా చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రభాస్ స్పిరిట్ మరో లెవల్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్లుగా దర్శకుడు స్పిరిట్‌ను రూపొందించే పనిలో ఉన్నాడు.
ప్రభాస్ స్పిరిట్ సినిమాతో...
ప్రభాస్ ఫ్యాన్స్‌లో అన్ని వర్గాల వారు ఉంటారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారు, మహిళలు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రభాస్‌కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ప్రభాస్‌ను అల్ట్రా యాక్షన్ ఎపిసోడ్స్‌లో, మరీ హింసాత్మక యాక్షన్ సీన్స్‌లో చూపిస్తే అందరూ చూసే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు ఒక సూపర్ హిట్ కోరుకుంటున్నారు. అది స్పిరిట్‌తో దర్శకుడు సందీప్ వంగ ఇవ్వడం కన్ఫర్మ్. అయితే ఫ్యాన్స్ అంతా చూసే విధంగా స్పిరిట్ ఉంటుందా అనే అనుమానం మాత్రం వ్యక్తం అవుతోంది. ప్రభాస్‌ను అభిమానించే వారిలో చిన్న పిల్లలు టీనేజర్స్ ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు స్పిరిట్ యాక్షన్ సీన్స్‌ను థియేటర్‌లో చూసేందుకు వీలు ఉండదు. ఎ సర్టిఫికెట్ సినిమా కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ శాతం థియేటర్లకు వెళ్లకుండా, ఓటీటీ కోసం వెయిట్ చేసే అవకాశాలు ఉంటాయని కొందరు అంటున్నారు.
సందీప్ రెడ్డి వంగ యాక్షన్ సీన్స్...
సందీప్ రెడ్డి వంగ గత చిత్రాలు హిట్ కావడానికి ప్రధాన కారణం హీరో బోల్డ్‌నెస్, హింసాత్మకమైన యాక్షన్ సీన్స్. కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను కూడా ఈయన యాడ్ చేస్తాడు. అలా చేస్తే ప్రభాస్ అభిమానులు ఎంత వరకు సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయగలరు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సినిమాలోని ప్రతి యాక్షన్ సీన్ ఒక కొరియన్ థ్రిల్లర్, యాక్షన్‌ను తలపించడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి సినిమాను చూస్తేనే ఆ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతాయి. మరి స్పిరిట్ కు ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటారా... సందీప్ వారిని థియేటర్‌లలో అడుగు పెట్టే విధంగా చేస్తాడా అనేది చూడాలి. స్పిరిట్ మూవీని వచ్చే ఏడాదిలో సమ్మర్ ఆరంభంలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా పలువురు స్టార్‌లు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
