Begin typing your search above and press return to search.

స్పిరిట్.. రెబల్స్ ని ఇక ఆపడం కష్టమే..!

స్పిరిట్ సినిమా ప్రతి యాస్పెక్ట్ లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే సందీప్ వంగ ప్లానింగ్ చేస్తున్నాడట.

By:  Ramesh Boddu   |   18 Oct 2025 10:22 AM IST
స్పిరిట్.. రెబల్స్ ని ఇక ఆపడం కష్టమే..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్ల పైన అయ్యింది. అయినా కూడా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదని రెబల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఐతే అలాంటి వారి కోసమే ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యేలా సందీప్ వంగ సినిమాను నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెడుతున్నారట. స్పిరిట్ సినిమా ప్రతి యాస్పెక్ట్ లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే సందీప్ వంగ ప్లానింగ్ చేస్తున్నాడట. ఇప్పటికే సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి.

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ..

ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసి పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ వంగ. అతని సినిమాలు ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకుంటాడు కానీ ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్తే చకచకా పని కానిచ్చేస్తాడు. అందులోనూ ఇప్పుడు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతని డేట్స్ ఇస్తే చాలు అన్న విధంగా పరిస్థితి ఉంది. అందుకే సందీప్ ఇన్నాళ్లు వెయిట్ చేశాడు.

ఐతే స్పిరిట్ మోడ్ లోకి వస్తే చాలు ప్రభాస్ ని తనకు కావాల్సిన విధంగా మార్చుకునేందుకు సందీప్ పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేశాడు. ప్రభాస్ ఆల్రెడీ చేతినిండా సినిమాలతో ఉన్నాడు. ఐతే వాటికి ప్రత్యేకంగా స్పిరిట్ ఉండేలా చేస్తున్నాడట. సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. విలన్ గా సౌత్ కొరియన్ యాక్టర్ ని తీసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి.

ప్రభాస్ తో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా..

అంతేకాదు ప్రభాస్ తో ఒకప్పటి హీరో తరుణ్, శ్రీకాంత్ లు కూడా నటిస్తారని తెలుస్తుంది. సో ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేశాడు. ఇక నవంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా లాక్ అయ్యింది. యానిమల్ తో సూపర్ పాపులర్ అయిన త్రిప్తి ప్రభాస్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.

సందీప్ వంగ సినిమా లవర్స్ అంతా కూడా అతని డైరెక్షన్ లో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడా అన్న ఎగ్జైట్ మెంట్ ఉంది. ఐతే ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ని చూస్తామంటూ హింట్స్ వస్తున్నాయి. సో ఈ నవంబర్ లో మొదలవుతున్న స్పిరిట్ 2026 సెకండ్ హాఫ్ రిలీజ్ సెట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. స్పిరిట్ సినిమాను పాన్ ఇండియా మూవీగా కాదు పాన్ వరల్డ్ యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ వంగ.