'స్పిరిట్'లో కాంచన.. ఈసారి రోల్ ఎలా ఉంటుందో?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో రూపొందనున్న స్పిరిట్ మూవీలో సీనియర్ నటి కాంచన యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 24 Oct 2025 12:30 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో రూపొందనున్న స్పిరిట్ మూవీలో సీనియర్ నటి కాంచన యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో కాంచన కీలక పాత్ర పోషించనున్నారని రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
అయితే టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ బ్యూటీ కాంచన. సౌత్ సినీ ఇండస్ట్రీలో అనేక మంది స్టార్ హీరోల సరసన నటించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కాంచన ముందు ఎయిర్ హోస్టెస్ గా వర్క్ చేయగా.. ఓ డైరెక్టర్ ఆమెను చూసి ఛాన్స్ ఇచ్చారు. కాదలిక నేరమిల్లై మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆత్మ గౌరవం మూవీతో టాలీవుడ్ లోకి రాగా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కాంచన. 1988 వరకు కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆమె.. యాక్టింగ్ కు విరామం ఇచ్చారు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ లో అర్జున్ రెడ్డి సినిమాలో మెరిశారు.
సందీప్ వంగానే దర్శకత్వం వహించిన ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో హీరో అమ్మమ్మ రోల్ లో కనిపించారు. తన యాక్టింగ్ అండ్ డైలాగ్స్ తో అందరినీ మెప్పించారు. అయితే అప్పట్లో అర్జున్ రెడ్డి కోసం ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు సందీప్ వంగా. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"కాంచనమ్మను సెలెక్ట్ చేద్దామంటే కష్టమని అంతా అనేశారు. చాలా ట్రై చేసినా కుదరలేదు. ఎంతో మందిని సంప్రదించినా నెంబర్ దక్కలేదు. దివంగత కృష్ణంరాజు బర్త్ డేకు భారీ ఫంక్షన్ చేశారు. ఆ ఈవెంట్ మేకర్ నా ఫ్రెండ్. అతని ద్వారా నెంబర్ అందుకున్నా. తర్వాత నేను కాల్ చేస్తే చూస్తా అన్నారు" అని సందీప్ చెప్పారు.
కానీ ఆ తర్వాత సినిమాలో నటించి మెప్పించారని తెలిపారు. అయితే అర్జున్ రెడ్డి తర్వాత మరో మూవీలో నటించని ఆమెను.. మళ్లీ స్పిరిట్ కు గాను తీసుకున్నారు సందీప్ వంగా. దీంతో ఈసారి ఆయన ఆమె కోసం ఎలాంటి రోల్ రాసుకున్నారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డిలో హీరో అమ్మమ్మగా చూపించిన సందీప్.. ఈసారి ఏం చేస్తారోనని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి కాంచనకు స్పిరిట్ లో ఎలాంటి రోల్ దక్కుతుందో.. ఆమె ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.
