ప్రభాస్ 'స్పిరిట్'.. ఎక్కడా నో బ్రేక్స్..
తాజాగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా షోడోలు మాత్రమే కనిపించే ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు మరింత ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
By: M Prashanth | 26 Jun 2026 1:00 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ స్పిరిట్. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఆ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా షూటింగ్ ఎక్కడా బ్రేక్ లేకుండా వేగంగా సాగుతోందన్న సమాచారం అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది. ఒక్కో షెడ్యూల్ ను పూర్తి చేస్తూనే వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ ను ప్రారంభించేలా మూవీ టీమ్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో కొనసాగనున్నట్లు సమాచారం. కథలో మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న సీన్స్ ను ఆ లొకేషన్ లో చిత్రీకరించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. కథలో కీలక మలుపు తీసుకొచ్చే జైలు బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నాయట.
సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కనిపించే ఇంటెన్స్ ట్రీట్మెంట్, స్ట్రాంగ్ క్యారక్టరైజేషన్, హై వోల్టేజ్ యాక్షన్ కు ఇప్పుడు స్పిరిట్ లోనూ పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జైలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.
ఆ షెడ్యూల్ పూర్తయ్యాక షూటింగ్ కు ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం. సినిమా పనులు వేగంగా పూర్తిచేసి నిర్ణయించిన విడుదల తేదీకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో యూనిట్ పనిచేస్తోందని తెలుస్తోంది. దీంతో స్పిరిట్ షూటింగ్ నాన్ స్టాప్ గా కొనసాగుతోందనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో స్పిరిట్ కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవుతోంది. తాజాగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా షోడోలు మాత్రమే కనిపించే ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు మరింత ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలు ఆ ఒక్క ఫోటోతోనే మరింత పెరిగాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆయన రోల్ ను ఇప్పటివరకు చూడని విధంగా డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో వివేక్ ఒబెరాయ్ కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.
మరోవైపు మ్యూజిక్ వర్క్స్, భారీ సెట్ల నిర్మాణం కొనసాగుతున్నాయని వినికిడి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంతో షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి స్టేజ్ ను వేగంగా పూర్తి చేస్తూ స్పిరిట్ ను ఎక్కడా బ్రేక్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్న ప్లాన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
