స్పిరిట్ లో కొరియన్ యాక్టర్.. ఉన్నాడా? లేడా?
అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా సందీప్ వంగా సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో కీలక సీన్ ఆడియో వినిపించిన మేకర్స్.. చివర్లో క్యాస్టింగ్ ను రివీల్ చేశారు.
By: M Prashanth | 24 Oct 2025 9:55 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. విభిన్నమైన రీతిలో మాస్ పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఆ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవ్వనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసిన సందీప్.. చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా సందీప్ వంగా సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో కీలక సీన్ ఆడియో వినిపించిన మేకర్స్.. చివర్లో క్యాస్టింగ్ ను రివీల్ చేశారు. త్రిప్తి డిమ్రీ, ప్రకాష్ రాజ్, కాంచన, వివేక్ ఒబెరాయ్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఎందుకంటే స్పిరిట్ మూవీలో విలన్ గా సౌత్ కొరియా యాక్టర్ డాంగ్ లీ నటిస్తున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ సలార్ పోస్టర్ ను డాంగ్ లీ షేర్ చేయడంతో ఆయన నిజంగా మూవీలో యాక్ట్ చేస్తున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు బర్త్ డే ట్రీట్ వీడియోలో ఆయన పేరు లేదు.
దీంతో ఏంటి డాంగ్ లీ.. స్పిరిట్ లో నటించడం లేదా అని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, కామెంట్లు పెడుతున్నారు. ఆయన యాక్ట్ చేస్తున్నారని చాలా ఆశపడ్డామని చెబుతున్నారు. ముఖ్యంగా మూవీ పోస్టర్ ను షేర్ చేయడంతో ఫిక్స్ అయిపోయామని.. ఇప్పటికైనా డాంగ్ లీని క్యాస్టింగ్ లోకి తీసుకోవాలని కోరుతున్నారు.
అదే సమయంలో స్పిరిట్ లో డాంగ్ లీ బదులు విలన్ గా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కథకు పెర్ఫెక్ట్ గా సెట్ అవుతారని సందీప్ ఆయనను సెలెక్ట్ చేశారని వినికిడి. అయితే రామ్ గోపాల్ వర్మ కంపెనీ మూవీతో నటుడిగా మారిన వివేక్.. రక్త చరిత్ర సినిమాలో తన యాక్టింగ్ తో ఓ రేంజ్ లో మెప్పించారు.
రామ్ చరణ్ వినయ విధేయ రామ మూవీలో కూడా విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ను ఢీకొట్టే రోల్ లో స్పిరిట్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వివేక్ ఒబెరాయ్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రభాస్ కటౌట్ పర్ఫెక్ట్ కాంబో అవుతుందని పలువురు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కానీ డాంగ్ లీని మాత్రం క్యామియో రోల్ కోసం తీసుకువచ్చినా బాగుంటుందని అంటున్నారు. మరి ఆ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.
