మూడు నెలలిస్తే ప్రభాస్ తో ముగింపే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'పౌజీ', 'రాజాసాబ్' చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 17 Sept 2025 5:01 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'పౌజీ', 'రాజాసాబ్' చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలకు ఏక కాలంలో డేట్లు కేటాయించి ముగిస్తున్నాడు. 'రాజాసాబ్' మరో నెల రోజుల్లో చిత్రీకరణ పూర్తి కానుంది. అటుపై ఆ సినిమాకు సంబంధించి ప్రభాస్ పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పనిలేదు. అనంతరం 'స్పిరిట్' కూడా మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే డేట్లు కూడా కేటాయించారు. ఇది మొదలయ్యే లోపు `పౌజీ` షూటింగ్ కూడా ఓ కొలిక్కి వస్తుంది. అనంతరం `కల్కి 2898` కూడా మొదలు పెట్టాలని డార్లింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
యంగ్ డైరెక్టర్ సిద్దంగా:
మరి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ప్రభాస్ ఇచ్చిన మాట సంగతేంటి? అంటే `స్పిరిట్` -`కల్కి` మధ్యలో ప్రశాంత్ వర్మ దూరేలా కనిపిస్తున్నాడు. ఈప్రాజెక్ట్ ను కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించడానికి రెడీ అవుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రీ విజువలైజేషన్ పనులు పూర్తి చేసాడు. సినిమాలో వచ్చే ప్రతీ షాట్ ని డిజైన్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు పట్టాలెక్కిం చాలని ఎదురు చూస్తున్నాడు. షూటింగ్ కి సంబంధించి ప్రభాస్ నుంచి కూడా ఎక్కువగా డేట్లు అవసరం లేనట్లే కనిపిస్తుంది.
అదే జరిగితే ఒప్పందం రద్దు:
కేవలం మూడు నెలలు ఇస్తే షూట్ పూర్తి చేసే ప్రణాళిక తన వద్ద సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో `స్పిరిట్` తో పాటు తన సినిమాను కూడా పట్టాలెక్కించాలనే ప్రపోజల్ ని డార్లింగ్ వద్దకు తీసుకెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ప్రభాస్ ఒకే చేస్తే గనుక వచ్చే ఏడాదే మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అందుకు ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే `స్పిరిట్` మొదలైన నాటి నుంచి మరో సినిమా షూటింగ్ చేయకూడదు అన్నది సందీప్ రెడ్డి వంగా కండీషన్. ఆ ప్రకారమే ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది.
రాజీపడే టైపు కాదు:
మళ్లీ ఇప్పుడా బాండ్ ని ప్రభాస్ బ్రేక్ చేస్తే కథ మరోలా ఉంటుంది. సందీప్ రెడ్డి ఎంత మాత్రం రాజీ పడే టైపు కాదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతోనే తానేంటో పాన్ ఇండియాకి చూపించాడు. స్టార్ హీరోలే అతడితో సినిమాలు చేయడానికి క్యూలో ఉన్నారు. స్పిరిట్ స్టోరీ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రభాస్ కోసమే కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నాడు. మధ్యలో మరో సినిమా చేసే అవకాశం ఉన్నా? డిస్టర్బ్ కాకుడదని ఇంకొన్ని నెలలైనా ఎదురు చూసేలా ఉన్నాడు. అలాంటి డైరెక్టర్ మధ్యలోకి ప్రశాంత్ వర్మ వస్తానంటే? ఊరుకుంటాడా!
