స్పిరిట్ ఫస్ట్ లుక్.. తెరపైకి దీపికా వివాదం..
చిత్ర పరిశ్రమలో రాంగోపాల్ వర్మ తర్వాత అదే రేంజిలో పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Madhu Reddy | 1 Jan 2026 6:27 PM ISTచిత్ర పరిశ్రమలో రాంగోపాల్ వర్మ తర్వాత అదే రేంజిలో పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా తనకు అనిపించింది చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈయన అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో సంచలనం సృష్టించారు. అలాంటి ఈయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక వినూత్నమైన కథను రూపొందించబోతున్నారు. అటు ప్రభాస్ కూడా తన కెరియర్ లో తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా.. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకున్నారు.
అయితే ఈ పోస్టర్ అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపినప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా దీపిక వివాదాన్ని తెరపైకి తీసుకురావడం సంచలనంగా మారింది.. ఇంకొంతమంది సందీప్ రెడ్డి వంగాకు అండగా నిలుస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ బేర్ బాడీతో.. ఒంటినిండా గాయాలతో ఒక చేతిలో మందు సీసా.. మరొకవైపు ఎదురుగా త్రిప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తున్నట్టు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇకపోతే ఈ పోస్టర్లో సంభాషణలు లేకపోయినా.. కథలో త్రిప్తి పాత్రకు బలమైన ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే మనకు స్పష్టంగా అనిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కారణం ఏమిటంటే సాధారణంగా పాన్ ఇండియా స్టార్ హీరోల చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లు ఎక్కువగా హీరోపై మాత్రమే దృష్టి పెడతాయి. కానీ స్పిరిట్ లో మొదటి రివీల్ లోనే హీరోయిన్ కూడా కనిపించే విధంగా.. హీరోయిన్ కి కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడం చూసి.. స్త్రీ పాత్ర అలంకారమైనది కాదు అని.. కథనాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ పోస్టర్ నిరూపించింది అంటూ సందీప్ రెడ్డి వంగా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో దీపిక వివాదాన్ని కూడా తెరపైకి తీసుకొస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా హీరోయిన్స్ కి అంత ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు దీపికాకు ఎందుకు అన్యాయం చేశారు అని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది యానిమల్ సినిమాలో త్రిప్తికి అంత పాధాన్నత ఇచ్చిన ఈయన.. మరోసారి స్పిరిట్ మూవీలో కూడా ఆమెకు బలమైన పాత్ర కల్పించారు. అయితే ఎందుకు ఆమెకే అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు త్రిప్తిని మీ సినిమాలో తీసుకోవాలనుకున్నప్పుడు.. దీపికాను ఎందుకు టార్గెట్ గా చేసి ఆమెను విమర్శలపాలు చేశారు అంటూ కూడా సందీప్ రెడ్డి వంగాపై ఆమె అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు
మరికొంతమంది ఏకంగా ఈ పోస్టర్ కాపీ అంటూ భారీ ట్రోల్స్ చేస్తున్నారు.మహేష్ బాబు అతిధి సినిమాలోని మహేష్ బాబు లుక్కుని గుర్తు చేస్తోంది అంటూ ఆ రెండు ఫోటోలను ఒకచోట చేర్చి మరీ ఇది కాపీ అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం సంచలనంగా మారింది.
