Begin typing your search above and press return to search.

'ఫౌజీ' ప‌రిస్థితేంటీ.. ఏ స్టేజ్‌లో ఉంది?`

మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు కూడా ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని ప‌రుగులు పెడుతున్నారు.

By:  Ravindar Gorantla   |   21 Feb 2026 7:59 PM IST
ఫౌజీ ప‌రిస్థితేంటీ.. ఏ స్టేజ్‌లో ఉంది?`
X

వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్నారు. అందులో ఒక‌టి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న `స్పిరిట్‌`. ఇందులో ప్ర‌భాస్ ఫ‌స్ట్‌టైమ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా డిఫ‌రెంట్ స్టైల్ మేన‌రిజమ్స్‌తో స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, డైలాగ్ ప్రోమో సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ మూవీతో పాటు ప్ర‌భాస్ న‌టించిన మ‌రో భారీ పాన్ ఇండియా మూవీ `ఫౌజీ`.

హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. `సీతారామం` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి `ఫౌజీ`ని కూడా ఇదే త‌ర‌హాలో సాగే పీరియాడిక్ వార్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిస్తున్నాడు.1940 టైమ్ పీరియ‌డ్‌కు సంబంధించిన ఓ సైనికుడి ప్రేమ‌గాథ‌గా దీన్ని అత్యంత భారీ స్థాయిలో ఓ యుద్దం రాసిన ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాలో అనుప‌మ్ ఖేర్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌య‌ప్ర‌ద‌, భానుచంద‌ర్‌, చైత్ర జె. ఆచ‌ర్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ప్ర‌వీన్ దాచారం త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.ఇటీవ‌లే ప్ర‌భాస్‌పై గుర్రపు స్వారీకి సంబంధించిన స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని, గుర్రం అదుపు త‌ప్ప‌డంతో ఆయ‌న కింద‌ప‌డ్డార‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే ప్ర‌మాదం జ‌రిగింది నిజ‌మే రానీ ప్ర‌భాస్‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని, ఆయ‌న క్షేమంగానే ఉన్నార‌ని టీమ్ ప్ర‌క‌టించ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.

ద‌స‌రా సంద‌ర్భంగా ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని టీమ్ ప‌ట్టుద‌ల‌తో వ‌ర్క్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు కూడా ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని ప‌రుగులు పెడుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా ప‌రిస్థితి ఏంటీ? ..ఎంత వ‌ర‌కు పూర్త‌యింది. ఇంకా ఎంత పెండింగ్ ఉంది అన్న‌ది తాజాగా బ‌య‌టికొచ్చింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన 35 డేస్ టాకీ, రెండు యాక్ష‌న్ సీక్వెన్స్‌లు పెండింగ్ ఉన్నాయ‌ట‌.

మ‌రో 20 రోజులు షూటింగ్ చేస్తే మొత్తం పూర్త‌వుతుంద‌ని చెబుతున్నారు. మేక‌ర్స్ మాత్రం ఏప్రిల్ 10 నాటికి టాకీని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. జూలై, ఆగ‌స్టులో 20 రోజుల్లో యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ని పూర్ఇ చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ వ‌ర్క్ చేస్తున్నారు. అలా అనుకున్న ప్లాన్ ప్ర‌కారం షూటింగ్ మొత్తం పూర్తి చేసి మూవీని ద‌స‌రాకు విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని చూస్తున్నారు. ప్ర‌భాస్ కూడా ఇదే ప్లాన్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ షూటింగ్‌ని ప‌రుగులు పెట్టిస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌.