Begin typing your search above and press return to search.

వంగా.. చివర్లో అసలు ఆట మొదలవుతుందా?

రెబల్ స్టార్ ప్రభాస్‌ ను ఇప్పటివరకు ఒకలా చూశారు.. కానీ సందీప్ రెడ్డి వంగా సినిమాలో మాత్రం మరోలా చూడబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

By:  M Prashanth   |   12 Oct 2026 3:08 PM IST
వంగా.. చివర్లో అసలు ఆట మొదలవుతుందా?
X

రెబల్ స్టార్ ప్రభాస్‌ ను ఇప్పటివరకు ఒకలా చూశారు.. కానీ సందీప్ రెడ్డి వంగా సినిమాలో మాత్రం మరోలా చూడబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా క్లైమాక్స్ గురించి వినిపిస్తున్న వార్తలు మరింత హైప్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ ను గతంలో ఎన్నడూ చూడని మాస్ అవతార్‌ లో చూపించేందుకు సందీప్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.

సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో క్లైమాక్స్‌ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కథను ముగించడమే కాకుండా.. ప్రేక్షకులకు స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా సీన్స్ డిజైన్ చేస్తారు. అర్జున్ రెడ్డిలో ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తే.. యానిమల్ లో యాక్షన్‌ తో పాటు పాత్రల మధ్య ఉండే కోపం, పగను స్ట్రాంగ్ గా చూపించారు. ముఖ్యంగా యానిమల్ లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఓ రేంజ్ లో మెప్పించింది.

ఇప్పుడు స్పిరిట్ లో అంతకుమించి ఎఫెక్ట్ చూపించేలా క్లైమాక్స్‌ ను ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. నవంబర్ మొదటి వారంలో ఆ సినిమా క్లైమాక్స్‌ కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకోసం భారీ సెట్‌ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ లో ప్రభాస్‌ ను చాలా రఫ్‌ గా, పూర్తి మాస్ లుక్‌ లో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

అయితే స్పిరిట్ లో ప్రభాస్ పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ గా కనిపించనున్నారు. ఆ రోల్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలతోపాటు, ఆయన ఫ్లాష్‌ బ్యాక్ కూడా సినిమాలో మెయిన్ గా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఫ్లాష్‌ బ్యాక్‌ లో ప్రభాస్ రోల్ ను మరింత భిన్నంగా చూపించేందుకు సందీప్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇక సందీప్ వంగా సినిమాల్లో కేవలం యాక్షన్ మాత్రమే ఉండదు. రోల్స్ మధ్య ఎమోషన్స్, వాటి వల్ల వచ్చే జరిగే ఇన్సిడెంట్స్ కూడా కథను ముందుకు నడిపిస్తాయి.

అందుకే స్పిరిట్ క్లైమాక్స్‌ లో కూడా భారీ ఫైట్ తోపాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. ప్రభాస్ మాస్ ఇమేజ్‌ కు సందీప్ తనదైన స్టైల్ ను యాడ్ చేస్తే స్క్రీన్ పై ఎలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో సందీప్ వంగా దర్శకత్వంలో ఆయన నటిస్తుండటం ఆ ప్రాజెక్టుపై మరింత హైప్ పెంచుతోంది.

ఇక స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి వంగా నార్మల్ క్లైమాక్స్‌ తో సరిపెట్టుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్స్, ప్రభాస్ కొత్త అవతార్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ కు కలిపి భారీ ఎండింగ్ ఇవ్వాలని చూస్తున్నారట. ఆ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మూవీ టీమ్ నుంచి మరిన్ని వివరాలు రావాలి. కానీ ఆ కాంబోలో క్లైమాక్స్ ఎలా ఉండబోతోందనే ఇంట్రెస్ట్ మాత్రం ఇప్పటి నుంచే సినీ ప్రియుల్లో మొదలైంది.