Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ 'యానిమల్‌'లా చేస్తే ఒప్పుకుంటారా?

చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు ఏ సినిమా అయినా చేయవచ్చు, ఎలాంటి పాత్రల్లో అయినా నటించవచ్చు.

By:  Ramesh Palla   |   19 Jan 2026 11:00 PM IST
ప్రభాస్‌ యానిమల్‌లా చేస్తే ఒప్పుకుంటారా?
X

చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు ఏ సినిమా అయినా చేయవచ్చు, ఎలాంటి పాత్రల్లో అయినా నటించవచ్చు. కానీ ఒక స్టార్‌ హీరో, క్రేజ్ ఉన్న హీరో, ఆకాశమే హద్దు అన్నట్లుగా ఇమేజ్ ఉన్న హీరో ఏ పాత్రను పడితే ఆ పాత్రను చేయడానికి వీలు లేదు. ఒక వేళ అలా చేస్తే కచ్చితంగా ఫ్యాన్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ హీరో ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి సినిమా చేయాలి అంటే కంటెంట్‌ అద్భుతంగా ఉండాలి, దర్శకుడు ప్రతిభావంతుడు అయ్యి ఉండాలి. ఆ ఇమేజ్ ను డామినేట్‌ చేసే విధంగా కంటెంట్‌ ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకులు ఆ హీరోను మరోలా చూసేందుకు ఒప్పుకుంటారు. ఇప్పుడు ప్రభాస్‌ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తనదైన శైలిలో చూపించేందుకు రెడీ అయ్యాడు. స్పిరిట్‌ సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో ఒకరకమైన ఆందోళన కలిగిస్తోంది.

ప్రభాస్ హీరోగా స్పిరిట్‌ మూవీ...

ప్రభాస్‌ హీరోగా ఇప్పటి వరకు చేసిన సినిమాలు మొత్తం ఒక ఎత్తు అయితే, స్పిరిట్‌ సినిమా ఒక ఎత్తు అన్నట్లుగా ఉండబోతుంది. ప్రభాస్ అనగానే మృదు స్వభావి, ఆయన చాలా కామ్‌ గోయింగ్‌, క్యూట్‌ పర్సన్‌ అనే అభిప్రాయం ఉంటుంది. అలాంటి వ్యక్తి అలాంటి పాత్రల్లో నటిస్తేనే బాగుంటుంది. వ్యక్తిగతంగా ఒక రకమైన వ్యక్తిని సినిమాలో మరో రకంగా చూపించే ప్రయత్నం చేస్తే కొన్ని సార్లు మిస్‌ ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రభాస్ వ్యక్తిగతం కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యొక్క హీరోల ప్రవర్తనకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. సందీప్ రెడ్డి సినిమాల్లో హీరోలను చూసి కొన్ని సార్లు బాబోయ్‌ మరీ ఇంత బోల్డ్‌గా జనాలు ఉంటారా.. మరీ ఇలా పచ్చిగా బూతులు మాట్లాడుతారా అనే అభిప్రాయం కలుగుతుంది. సందీప్ మరీ హద్దులు దాటి మరీ బూతులు మాట్లాడిస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు వారంతా కూడా ప్రభాస్‌తో సందీప్ ఎలాంటి డైలాగ్స్ చెప్పిస్తాడో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్‌...

యానిమల్‌ సినిమాతో పాటు సందీప్ అంతకు ముందు చేసిన సినిమాలోనూ హీరో పాత్రను బోల్డ్‌గా డిజైన్ చేయడంతో పాటు, చాలా సీన్స్ ను పెద్దలకు మాత్రమే అన్నట్లుగా చేయడం జరిగింది. ప్రభాస్ సినిమా అంటే అందరూ చూసే విధంగా ఉండాలి అనేది చాలా మంది అభిప్రాయం. కానీ సందీప్ చేస్తే ప్రభాస్ సినిమాను అందరూ చూడలేరేమో అనే అనుమానం కలుగుతోంది. ప్రభాస్ వంటి సాఫ్ట్‌ యాక్టర్‌ ను యానిమల్‌ సినిమాలో రణబీర్‌ కపూర్ మాదిరిగా చూపిస్తే తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఏ భాషకు చెందిన ప్రేక్షకులు కూడా ఒప్పుకోక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభాస్‌ వంటి క్యూట్‌ హీరో ను చాలా రఫ్‌గా, హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ లో చూపించడం వల్ల ప్రేక్షకులు కూడా కచ్చితంగా ఇబ్బంది ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.

రాజాసాబ్‌ ఫలితం నుంచి...

సినిమాలోని కథ, కంటెంట్‌ బలంగా ఉంటే ప్రభాస్ అలా చేశాడు ఏంటి, మరీ ఇలా మాట్లాడాడు ఏంటి అనేది జనాలు పట్టించుకోరు అనేది సందీప్ వాదన. అందుకే ఆయన యానిమల్‌ సినిమాలో రణబీర్‌ కపూర్‌తో ఎలాంటి డైలాగ్‌లు చెప్పించాడో, ఎలాంటి సీన్స్ లో నటింపజేశాడో అలాంటి సీన్స్‌, అలాంటి డైలాగ్స్ ను ప్రభాస్‌ తో చెప్పించడం ఖాయం. అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు అనేది ఇప్పటికీ కొందరు అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రభాస్ సలార్ సినిమా సైతం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసే విధంగా ఉండదని, కనుక స్పిరిట్‌ సినిమా విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల వారు చెందరు చెబుతున్న విశ్లేషణ. మొత్తానికి ప్రభాస్ స్పిరిట్‌ సినిమా యూత్‌ ను ఓ రేంజ్‌ లో ఊపడం ఖాయం. ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ కూడా మారినా ఆశ్చర్యం లేదు. రాజాసాబ్‌ నిరుత్సాహ పరిచిన స్పిరిట్‌ అన్నింటికి సమాధానం చెప్పబోతుంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.