మరో ఆరు నెలలు ప్రభాస్ కనిపించరా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైనప్ లో ఉన్న చిత్రాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.
By: M Prashanth | 29 Nov 2025 11:21 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైనప్ లో ఉన్న చిత్రాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలకు గాను తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్పిరిట్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం.
టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి.. ఫస్ట్ సీన్ కు క్లాప్ ఇచ్చారు. అయితే పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోస్ ను మేకర్స్ షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరినీ ఆకట్టుకున్నాయి.
కానీ ఆ సమయంలో ప్రభాస్ లుక్ లీక్ అవ్వకుండా చూసుకున్నారు మేకర్స్. ఆయన ఉన్న ఒక్క ఫోటో కూడా విడుదల చేయలేదు. దీంతో డార్లింగ్ లుక్ రివీల్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అప్పుడే క్లారిటీ రాగా.. ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ లుక్ విషయంలో అత్యంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కు సంబంధించిన లుక్ ఎట్టి పరిస్థితుల్లో రివీల్ అవ్వకూడదని సందీప్ వంగా నిర్ణయించుకున్నారు! అందుకే మరో ఆరు నెలలపాటు పబ్లిక్ ఈవెంట్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలని ప్రభాస్ కు సందీప్ కోరినట్లు సమాచారం. ఎందుకంటే.. డార్లింగ్ ఎక్కడైనా కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపిస్తుంటారు.
దీంతో సోషల్ మీడియాలో ఆ పిక్స్ వైరల్ అయిపోతాయి. అందుకే కొన్ని నెలలపాటు ఎలాంటి కార్యక్రమాల్లో కూడా హాజరవొద్దని సూచించారట. ఆ విషయం తెలిసి ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. తమ ఫేవరెట్ హీరోను సందీప్ ఎలా ప్రెజెంట్ చేస్తారో చూసేందుకు ఆసక్తితో ఉన్నామని అంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటి కాజోల్ కూడా నటిస్తున్నట్లు కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి మూవీ ఎప్పుడు వస్తుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.
