Begin typing your search above and press return to search.

స్పిరిట్.. 200 మందితో ఊచకోత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకపక్క రాజా సాబ్ విడుదలకు సిద్దమవుతోంది. మరోపక్క ఫౌజీ పనులు కూడా జరుగుతున్నాయి.

By:  M Prashanth   |   16 Dec 2025 6:57 PM IST
స్పిరిట్.. 200 మందితో ఊచకోత
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకపక్క రాజా సాబ్ విడుదలకు సిద్దమవుతోంది. మరోపక్క ఫౌజీ పనులు కూడా జరుగుతున్నాయి. కానీ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకుడు కావడమే ఇందుకు కారణం. ప్రభాస్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూడాలన్న కోరిక ఈ సినిమాతో తీరబోతోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక లేటెస్ట్ గా సినిమా గురించి బయటకు వచ్చిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ ఎత్తున సెట్స్ నిర్మాణం జరుగుతోంది. సాధారణంగా సందీప్ వంగా సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. కానీ స్పిరిట్ కోసం ఆయన భారీ సెట్టింగ్స్ వేయిస్తున్నారంటే కథ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

అసలు విషయం ఏంటంటే ఈ సెట్స్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. సినిమాకే హైలైట్ గా నిలిచే ఈ ఫైట్ కోసం దాదాపు 200 మంది ఫైటర్లు పాల్గొనబోతున్నారు. ప్రభాస్ ఒక్కడే వందల మందిని ఎదిరించే సన్నివేశం అంటే అది కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. యానిమల్ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఎంత వైలెంట్ గా ఉందో మనం చూశాం. ఇప్పుడు స్పిరిట్ లో అంతకు మించిన యాక్షన్ ఉంటుందని ఈ 200 మంది ఫైటర్ల లెక్క చెబుతోంది.

రాబోయే షెడ్యూల్ మొత్తం ఈ యాక్షన్ ఎపిసోడ్ మీదే ఉండబోతోంది. ఇందుకోసం ఫైట్ మాస్టర్లు, టెక్నీషియన్లు ఇప్పటికే రిహార్సల్స్ కూడా మొదలుపెట్టారని సమాచారం. ప్రభాస్ కూడా ఈ యాక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నారు. పోలీస్ యూనిఫామ్ లో ప్రభాస్ 200 మందిని చితక్కొడుతుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. సందీప్ వంగా మార్క్ టేకింగ్, ప్రభాస్ కటౌట్ కలిస్తే వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి.

నిర్మాతలు కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సెట్స్ నిర్మాణం కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారట. ఈ ఒక్క షెడ్యూల్ తోనే సినిమా స్థాయి ఏంటో తెలిసిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ప్రభాస్ కెరీర్ లోనే ఇది ఒక కల్ట్ యాక్షన్ గా నిలిచిపోయే సినిమా అవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఏదేమైనా స్పిరిట్ సందడి మొదలైంది. ఇన్నాళ్లు స్క్రిప్ట్ పనులకే పరిమితమైన ఈ సినిమా ఇప్పుడు గ్రౌండ్ లోకి దిగుతోంది. త్వరలోనే ప్రభాస్ సెట్ లోకి అడుగుపెట్టనున్నారు. 200 మంది ఫైటర్లతో జరిగే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.