Begin typing your search above and press return to search.

ఇంట్లో ప్రభాస్ స్టైల్ ఇదే.. కంఫర్ట్‌లోనే క్లాస్

రోమాంచకం సినిమా వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి సర్ ప్రైజ్ అయితే దొరికింది. చాలా రోజులు షూట్స్ తోనే బిజీగా ఉన్న డార్లింగ్ ఎట్టకేలకు ఆ టీమ్ ద్వారా బయటకు వచ్చాడు.

By:  M Prashanth   |   2 Sept 2026 6:59 PM IST
ఇంట్లో ప్రభాస్ స్టైల్ ఇదే.. కంఫర్ట్‌లోనే క్లాస్
X

రోమాంచకం సినిమా వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి సర్ ప్రైజ్ అయితే దొరికింది. చాలా రోజులు షూట్స్ తోనే బిజీగా ఉన్న డార్లింగ్ ఎట్టకేలకు ఆ టీమ్ ద్వారా బయటకు వచ్చాడు. సాయం చేయడంలో ముందుండే రెబల్ స్టార్ ఇక తన ఫ్యాన్ సుమంత్ సినిమాకు స్పెషల్ గా సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక ‘రోమాంచకం’ టీమ్ ప్రభాస్‌ను కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి. సుమంత్ ప్రభాస్‌తో పాటు సినిమా టీమ్ మొత్తం ఆయనతో కాసేపు మాట్లాడి, విషెస్ అందుకుంది.




అయితే ఈ మీటింగ్‌లో ప్రభాస్ డ్రెస్ కూడా సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ ను క్రియేట్ చేసుకుంది. నార్మల్ గా స్టార్ హీరోలు బయట కనిపించినప్పుడు బ్రాండెడ్ జాకెట్లు, డిజైనర్ షర్ట్స్, షూస్‌తో కనిపించడం కామన్. ప్రభాస్ మాత్రం ఇంటి దగ్గర అలాంటి హడావుడి పెద్దగా పట్టించుకోడు. ఈ ఫోటోల్లో వైట్ లూజ్ షర్ట్, రెడ్ అండ్ బ్లాక్ చెక్స్ బాటమ్‌తో చాలా కంఫర్టబుల్‌గా కనిపించాడు. దానికి ఆరెంజ్ గ్లాసెస్ మాత్రమే కొంచెం స్టైలిష్ టచ్ ఇచ్చాయి.




ప్రభాస్ పబ్లిక్ అప్పియరెన్సెస్‌లో కూడా ఈ కంఫర్ట్ స్టైల్ కొత్తేమీ కాదు. ఈవెంట్స్ కాకుండా ఇంటి దగ్గర ఎవరైనా ప్రమోషన్ సందర్భాల్లో కనిపిస్తే ఎక్కువగా లూజ్ షర్ట్స్, సింపుల్ ప్యాంట్స్ లేదా రిలాక్స్‌డ్ అవుట్‌ఫిట్స్‌లోనే కనిపిస్తుంటాడు. స్టార్ హీరో హడావుడి కనిపించదు. ప్రతి సందర్భానికీ ప్రత్యేకంగా రెడీ అవ్వాలనే లెక్క అతని దగ్గర పెద్దగా కనిపించదు.

ఇక ‘రోమాంచకం’ టీమ్‌తో ఉన్న ఫోటోల్లో కూడా అదే కనిపించింది. అందరూ కూర్చుని సినిమా గురించి మాట్లాడుతుండగా ప్రభాస్ పూర్తిగా రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నాడు. ఒక ఫోటోలో ట్యాబ్‌లో ఏదో చూస్తూ కనిపించగా, మరో ఫోటోలో సుమంత్ ప్రభాస్‌తో మాట్లాడుతున్నాడు. పెద్ద ప్రమోషనల్ మీట్‌లా కాకుండా ఇంట్లో జరిగిన నార్మల్ మీట్ లా ఈ ఫోటోలు ఉన్నాయి.

ఇక సుమంత్ ప్రభాస్‌కు ఇది మరింత స్పెషల్ మూమెంట్. ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్‌కు ముందు ఈ రాత్రే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ స్టార్ బజ్ ఈ సినిమాకు ఎంతవరకు క్రేజ్ తీసుకొస్తుందో చూడాలి.