ఒకే చోట ప్రభాస్ అటు..ఇటూ!
దీంతో ప్రభాస్ కూడా రెండు సినిమా షూటింగ్ లకు హాజరు కావడం విశేషం. ఒకేసారి ఒకే రోజు రెండు సినిమా షూటింగ్ లకు హాజరవ్వడం అంత సులభం కాదు.
By: Srikanth Kontham | 26 Sept 2025 11:23 AM ISTడార్లింగ్ ప్రభాస్ రెండు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు `రాజాసాబ్`..మరోవైపు `పౌజీ` అంటూ రెండు చిత్రాలకు డేట్లు కేటాయించి డే అండ్ నైట్ పని చేస్తున్నాడు. `పౌజీ` మొదలైన అనంతరం తాత్కాలికంగా `రాజాసాబ్` ని కొన్ని నెలల పాటు పక్కన బెట్టినా? ఆలస్యమవ్వడంతో ఆ చిత్రాన్ని కూడా `పౌజీ`తో పాటు మళ్లీ రీ స్టార్ట్ చేసారు. తాజాగా ఈ రెండు సినిమాల షూటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ప్రస్తుతం ` పౌజీ`, `రాజాసాబ్` రెండు షూటింగ్ లు రామోజీ ఫిలింసిటీలోనే వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతున్నాయి.
ఒకరోజు అలా..మరో రోజు ఇలా:
దీంతో ప్రభాస్ కూడా రెండు సినిమా షూటింగ్ లకు హాజరు కావడం విశేషం. ఒకేసారి ఒకే రోజు రెండు సినిమా షూటింగ్ లకు హాజరవ్వడం అంత సులభం కాదు. ఈ రెండు చిత్రాలకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ కావడంతో ప్రభాస్ తో పాటు ఇతర తారాగణం పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఒక రోజు పూర్తిగా `పౌజీ`కి కేటాయిస్తే మరో రోజు `రాజాసాబ్` కి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు రెండు షూటింగ్ లకు ప్రభాస్ హాజరైతే కొంత డిస్టబెన్స్ ఏర్పడుతుంది అన్న నేపథ్యంలో మేకర్స్ ఇలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు.
సజావుగా రెండు షూటింగ్లు:
దీనికి సంబంధించి ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న దానిపై మారుతి..హను రాఘవపూడి కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఎక్కడా ఒత్తిడి గురికాకుండా ఇరువురు ప్లాన్ చేసుకోవడంతో రెండు సినిమా షూటింగ్ లు సజావుగా సాగుతున్నాయి. మరి ఆర్ ఎఫ్ సీలో ఇలా ఎన్ని రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు? అన్నది తెలియాలి. `రాజాసాబ్` రిలీజ్ డిసెంబర్ నుంచి జనవరికి వాయిదా పడుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడమే ఈ వాయిదాకి కారణంగా తెలుస్తోంది.
ఆ రెండు కూడా త్వరలోనే:
అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఇక `పౌజీ` రిలీజ్ కు సంబంధించి ఎలాంటి డేట్ కూడా హను ఇవ్వలేదు. ఎలా లేదన్నా వచ్చే ఏడాది అయితే రిలీజ్ అవ్వడం పక్కాగా అభిమానులు భావిస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న `స్పిరిట్` చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. అలాగే `కల్కి 2`,` సలార్ 2` కూడా డార్లింగ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు.
