Begin typing your search above and press return to search.

ఎమోషన్స్, యాక్షన్ మాత్రమే కాదు.. స్పిరిట్ అంతకుమించి

ఓ విధంగా ఈ రెండు సినిమాలు అటు యాక్షన్, ఎమోషన్ తో పాటు పేట్రియాటిజం తో కూడా అదరగొట్టేస్తాయని చెప్పొచ్చు.

By:  Ramesh Boddu   |   17 Dec 2025 11:23 AM IST
ఎమోషన్స్, యాక్షన్ మాత్రమే కాదు.. స్పిరిట్ అంతకుమించి
X

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. యానిమల్ తర్వాత సందీప్ వంగ నుంచి సినిమా వస్తుంది అంటే అది నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో సందీప్ వంగ స్పిరిట్ విషయంలో కూడా ఒక రేంజ్ ప్లానింగ్ తోనే వస్తున్నాడని తెలుస్తుంది. రెగ్యులర్ గా సందీప్ వంగ సినిమాల్లో ఉండే యాక్షన్, ఎమోషన్స్ తో పాటు స్పిరిట్ లో కొత్తగా దేశభక్తిని కూడా చూపిస్తాడట. తన ప్రతి సినిమాలో ప్రేమను, కమర్షియల్ అంశాలను రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చూపిస్తున్న సందీప్ వంగ ఈసారి స్పిరిట్ పేట్రియాటిజం కూడా అదే రేంజ్ లో చూపిస్తాడని అంటున్నారు.

రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు..

ఆల్రెడీ ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఆ స్టార్ కటౌట్ తో సందీప్ వంగ నెక్స్ట్ లెవెల్ మాస్ బొమ్మ అది కూడా పవర్ ఫుల్ పోలీస్ కథతో దానిలోనే దేశభక్తిని యాడ్ చేస్తూ ప్లాన్ చేస్తున్నాడట. ఇది తెలిసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. ఆల్రెడీ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమాలో కూడా అతను ఒక సోల్జర్ గా వార్ సీక్వెన్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు పోలీస్ రోల్ లో దేశభక్తిని చూపిస్తాడట.

ఓ విధంగా ఈ రెండు సినిమాలు అటు యాక్షన్, ఎమోషన్ తో పాటు పేట్రియాటిజం తో కూడా అదరగొట్టేస్తాయని చెప్పొచ్చు. హను ఏమో కానీ సందీప్ వంగ మ్యాడ్ నెస్ ఎలా ఉంటుందో అర్జున్ రెడ్డి, యానిమల్ లో చూశాం అలాంటి డైరెక్టర్ దేశ భక్తిని ఎలాంటి యాక్షన్ తో చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ హీరోగా అనుకున్న తర్వాతే సందీప్ వంగ ఈ సినిమా ప్లాన్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

ప్రభాస్ త్రిప్తి తో రొమాన్స్..

ఏది ఏమైనా రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తో త్రిప్తి డిమ్రి జత కడుతుంది. ప్రభాస్ తన కెరీర్ లో ఎప్పుడు చేయని విధంగా త్రిప్తి తో రొమాన్స్ కూడా ఉంటుందని టాక్. స్పిరిట్ సినిమాకు ఆల్రెడీ హర్షవర్ధన్ రామేశ్వరన్ బిజిఎం రెడీ చేశాడు. సినిమాతో మరోసారి సందీప్ వంగ రేంజ్ ఏంటన్నది చూపించేలా ప్లాన్ చేస్తున్నాడు.

సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ 2027 రిలీజ్ ప్లానింగ్ ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలు కూడా అదే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసేలా ఉన్నాడు. ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో వస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత 2027 స్పిరిట్, 2028 కల్కి 2 రిలీజ్ ప్లానింగ్ ఉంది.