Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్పిరిట్.. సందీప్ వన్ ఇయర్ ప్లాన్..?

ఐతే సందీప్ వంగాతో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. సందీప్ వంగ వర్కింగ్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.

By:  Ramesh Boddu   |   14 Aug 2025 11:44 AM IST
ప్రభాస్ స్పిరిట్.. సందీప్ వన్ ఇయర్ ప్లాన్..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను ఫిక్స్ చేసుకున్నాడు కానీ వాటి రిలీజ్ ల విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. రాజా సాబ్ ఇంకా రిలీజ్ కాలేదు. డిసెంబర్ రిలీజ్ అనుకుంటుంటే ఇప్పుడు దాన్ని కూడా జనవరికి వాయిదా వేస్తారని టాక్. హిందీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మరీ ప్రభాస్ సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ హనుతో ఫౌజీ చేస్తున్నాడు. అది కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.

సందీప్ వంగ వర్కింగ్ స్టైల్ ..

ఐతే సందీప్ వంగాతో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. సందీప్ వంగ వర్కింగ్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అతని సినిమా వరల్డ్ లోకి వెళ్తే అతనికి ఇచ్చిన డేట్స్ లో అనుకున్న షెడ్యూల్ పూర్తి కావాలి. అందుకే సందీప్ ప్రభాస్ లాంటి బిజీ స్టార్ తో కూడా త్వరగా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో స్పిరిట్ సినిమాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ప్రభాస్ తో 6 నెలల్లో షూట్ పూర్తి చేసి.. మిగతా 3 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసి వన్ ఇయర్ లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట.

ప్రభాస్ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన వన్ ఇయర్ లో రిలీజ్ అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో రికార్డ్ అన్నట్టే. ప్రభాస్ లేట్ చేస్తున్నాడని కాదు కానీ ఏదో ఒక రీజన్ తో అలా జరుగుతుంది. మెయిన్ ప్రభాస్ సినిమాల్లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ప్రభాస్ వల్ల కొంత.. ఆ సీజీ వర్క్ వల్ల కొంత లేట్ అవుతుందట. ఐతే సందీప్ వంగ సినిమాల్లో అంత వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉండదు.. ఉన్నా కూడా చాలా లిమిటెడ్ గానే ఉంటుంది.

ప్రభాస్ కోసమే 2, 3 ఏళ్లు..

సో ప్రభాస్ స్పిరిట్ సందీప్ అనుకున్నట్టుగానే వన్ ఇయర్ లో పూర్తి చేసి రిలీజ్ చేసినా చేస్తాడు. సందీప్ వంగ స్పిరిట్ తర్వాత వరుస కమిట్మెంట్ లు ఉన్నాయి. ప్రభాస్ కోసమే 2, 3 ఏళ్లు టైం వేస్ట్ చేసే ఛాన్స్ ఉండదు. మరి రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ స్పిరిట్ షూట్ ఎలా ప్లాన్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. స్పిరిట్ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.