స్పిరిట్ డాన్ లీ.. సీక్రెట్ బయట పెట్టిన కొరియన్ మీడియా..!
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమా నుంచి రీసెంట్ గా ఒక క్రేజీ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
By: Ramesh Boddu | 29 Oct 2025 2:52 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమా నుంచి రీసెంట్ గా ఒక క్రేజీ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. సందీప్ ప్రభాస్ తో చేసే సినిమా ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక ఆడియో టీజర్ వదిలాడు. ఐతే అదంతా సందీప్ ప్లానింగ్ లో భాగమే అని తెలిసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అంతేకాదు దానితో పాటు స్పిరిట్ సినిమాలో కాస్టింగ్ గురించి కూడా అనౌన్స్ చేశాడు సందీప్ వంగ. ప్రభాస్ తో త్రిప్తి డిమ్రి జత కడుతుండగా ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ లాంటి పేర్లు అనౌన్స్ చేశారు.
స్పిరిట్ లో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ..
ఐతే స్పిరిట్ లో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ ఉంటాడన్న న్యూస్ తెలిసిందే. దాదాపు ఏడాది నుంచి స్పిరిట్ లో డాన్ లీ ఉంటున్నాడన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు ఆమధ్య తరుణ్, శ్రీకాంత్ లాంటి స్టార్స్ డాన్ లీతో ఫోటో దిగడంతో వీళ్లు కూడా ఈ సినిమాలో ఉంటారన్న టాక్ వచ్చింది. ఐతే సందీప్ వంగ కాస్టింగ్ రివీల్ చేయగా అందులో డాన్ లీ పేరు లేకపోవడంతో అంతా షాక్ అయ్యారు.
సందీప్ అనౌన్స్ చేసిన కాస్టింగ్ లిస్ట్ లో డాన్ లీ లేడు కాబట్టి స్పిరిట్ లో అతను లేడని అనుకున్నారు. కానీ కొరియన్ మీడియా మాత్రం స్పిరిట్ తో డాన్ లీ ఇండియన్ సినిమా తెరంగేట్రం చేస్తున్నాడని ప్రకటించారు. కొరియన్ పాపులర్ మీడియా అయిన ముకోస్ తన సినిమా న్యూస్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. మా డాంగ్ సియో అలియాస్ డాన్ లీ స్పిరిట్ తో ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడని ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నారని వార్తలను ప్రకటించింది.
సందీప్ వంగాతో ప్రభాస్ కాంబో హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్..
సో సందీప్ వంగ ప్లానింగ్ లో భాగంగానే స్పిరిట్ లో డాన్ లీ లేడన్నట్టు చేసి రిలీజ్ టైం కు సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాడా అనే డౌట్ మొదలైంది. ఏది ఏమైనా సందీప్ వంగాతో ప్రభాస్ కాంబోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడేలా చేయగా అందులో డాన్ లీ లాంటి పవర్ ఫుల్ విలన్ ఉంటే మాత్రం కచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
సందీప్ వంగ యానిమల్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి స్పిరిట్ తో కూడా తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. స్పిరిట్ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తున్న సందీప్ వంగ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2027 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
