Begin typing your search above and press return to search.

నెవ్వర్ బిఫోర్ పాత్రలో ప్రభాస్.. డార్లింగ్ కోసం సందీప్ బిగ్ ప్లాన్

ఈ పాత్ర కోసం ప్రభాస్ ప్రత్యేక లుక్ రెడీ చేసుకుంటున్నారని తెలిసింది. అలాదే దీని కోసం ఫిజికల్ గా కూడా బాగా బరువు తగ్గాడట.

By:  M Prashanth   |   5 Sept 2025 5:00 AM IST
నెవ్వర్ బిఫోర్ పాత్రలో ప్రభాస్.. డార్లింగ్ కోసం సందీప్ బిగ్ ప్లాన్
X

రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా మోస్ట్ అవెయిటెడ్ సినిమా స్పిరిట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ కాంబినేషన్ ప్రకటించిన రోజు నుండి ప్రేక్షకులలో అంచనాలను పెంచుతోంది. ఇందులో ప్రభాస్ ఎన్నడూ లేని విధంగా పోలీసు పాత్రలో నటించనున్నారు. దీంతో అంచనలు కూడా ఆ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. ఈ పోలీసు యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్ ఇంతకు ముందెన్నడూ చూడని లుక్‌ లో కనిపిస్తాడని సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఈ పాత్ర కోసం ప్రభాస్ ప్రత్యేక లుక్ రెడీ చేసుకుంటున్నారని తెలిసింది. అలాదే దీని కోసం ఫిజికల్ గా కూడా బాగా బరువు తగ్గాడట. అలాగే తన హెయిర్ స్టైల్ కూడా మారినట్లు రీసెంట్ గా ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్న ఫొటోల్లో కనిపిస్తుంది. అలాగే సాధారణంగా కాకుండా ప్రభాస్ ఈ సినిమాలో కొత్త హెయిర్ స్టైల్, ట్రెండీ ఔట్ ఫిట్ లో కనిపించనున్నారని టాక్. ఈ సినిమాతో సందీప్.. ప్రభాస్ ను తన కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రభాస్ సాధారణంగా ఇంట్రోవర్ట్ అని అందరికీ తెలుసు. అతడు బయట ఆడియో ఫంక్షన్లలో, ఇంటర్వ్యూల్లో కూడా పెద్దగా మాట్లాడడు. షూటింగ్ లోనూ కంఫర్ట్ జోన్ లోనే ఉంటాడని టాక్ ఉంది. కానీ, ఈ సినిమా కోసం సందీప్.. ప్రభాస్ ను పూర్తిగా మార్చేయనున్నారని తెలుస్తోంది. ఆయనను పూర్తిగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి షూటింగ్ జరపనున్నట్లు సమాచారం. ఈ వార్తతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

అంతేకాకుండా సందీప్ వంగా తన హీరోల నుండి ఉత్తమ నటనను తీసుకువస్తాడు. గతంలో ఆయన తెరకెక్కించిన విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణ్ బీర్ ల విషయంలో ఇదే జరిగింది. ఆయా హీరోల ఫుల్ యాక్షన్ మోడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక స్పిరిట్ లోనూ ప్రభాస్ కోసం ఇలాంటి పాత్రనే రెడీ చేశారని సమాచారం. ఇది ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుందని.. చూడడానికి రెండు కళ్లు సరిపోవని అంత గ్రాండ్ గా ప్రభాస్ పాత్రను డిజైన్ చేస్తున్నారని అంటున్నారు.

ఇక ఇదే నెలలో స్పిరిట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అటు సందీప్ లొకేషన్ల వేటలో ఉన్నారు. అయితే సినిమా ఈ నెలలోనే ప్రారంభమైనా.. ప్రభాస్ మాత్రం నవంబంర్ లో సెట్ల్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.