ఫ్యాన్స్ రిక్వెస్ట్..మెంటల్ ఎక్కిపోవాలి!
సందీప్ రెడ్డి వంగా మేకింగ్..టేకింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడి పనితనం ఎలా ఉంటుందన్నది 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సంచలనాలతో ప్రూవ్ చేసాడు.
By: Srikanth Kontham | 10 Sept 2025 3:00 PM ISTసందీప్ రెడ్డి వంగా మేకింగ్..టేకింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడి పనితనం ఎలా ఉంటుందన్నది 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సంచలనాలతో ప్రూవ్ చేసాడు. రెండు సినిమాలు హీరో క్యారెక్టర్ మీద నడిచే కథలే. తాను నమ్మిన పాయింట్ ని హీరో పాత్రతో ఎంతో బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. కథని ఇలా హీరో క్యారెక్టర్ని బేస్ చేసుకుని కూడా స్ట్రాంగ్ గా ఎంగేజ్ చేయోచ్చని చెప్పినట మొదటి దర్శకుడు ఇతడే. అసలైన న్యూ ఏజ్ మేకర్ అంటే ఎలా ఉంటాడన్నది చూపించాడు. అందుకే రాంగోపాల్ వర్మ, రాజమౌళి లాంటి దిగ్గజాలు కూడా అతడిని ప్రత్యేకంగా ప్రశంశించారు.
ప్రభాస్ రోల్ అలా:
అలాంటి సంచలనానికి ప్రభాస్ తోడయ్యాడిప్పుడు. ఇద్దరి కాంబినేషన్ లో 'స్పిరిట్' కి రంగం సిద్దమ వుతోంది. 'స్పిరిట్' లో ప్రభాస్ పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందన్నది? ఇప్పటికే సూచయగా హింట్ ఇచ్చాడు. రెండు రేర్ డ్రగ్స్ కలిపి కొడితే? ఎలా ఉంటుందో? ప్రభాస్ రోల్ అంత కిక్ ఇస్తుందని లీక్ ఇచ్చాడు. 'అర్జున్ రెడ్డి' , 'యానిమల్' చిత్రాల్లో ఆ రెండు పాత్రలకు పదింతలు మించి ప్రభాస్ రోల్ ఉంటుందని ఓ అంచనాకి వచ్చేసారు ఫ్యాన్స్. సందీప్ కథల్లో భారీ డైలాగు..పవర్ పుల్ పంచ్ లుండవు. హీరో కి ఓ కొత్త యాటిట్యూడ్ ని అపాదించడం సందీప్ ప్రత్యేకత.
సందీప్ మార్క్ ట్రీట్ మెంట్:
ఈ నేపథ్యంలో ప్రభాస్ కి ఏ రేంజ్ యాటిట్యూడ్ అప్పగిస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ప్రభాస్ కాఫ్ పాత్రలో కనిపిస్తాడన్నది అధికారికం. ఆ పాత్రనే సందీప్ తన మార్క్ లో హైలైట్ చేస్తాడు. కాఫ్ సిస్టమ్ ని సైతం హీరో ఎలా బ్రేక్ చేస్తాడు? అన్నది సందీప్ మార్క్ ట్రీట్ మెంట్ లో హైలైట్ అవుతుంది. తి త్వరలోనే సినిమా సెట్స్ కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు సందీప్ కి రిక్వెస్ట్ లు మొదలు పెట్టారు. బాస్ కంటెంట్ కం కటౌట్ తో మెంటల్ ఎక్కిపోవాలి? అంటూ ఓ అభిమాని కోరాడు.
అభిమానుల అభ్యర్దన:
ప్రభాస్ ఎలా కనిపిస్తాడు? అన్నది ఇప్పటికే ఊహాల్లో తేలుతున్నాం. ఆ పాత్ర ఎంత బలంగా ఉంటుందో? తెరలు చిరిగిపోయేలా ఉంటాయో? చూసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ కోరుతున్నారు. మీపై మాకున్న నమ్మకం అలాంటిందంటూ సందీప్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ రిక్వెస్ట్ లను సందీప్ ఎలా తీసుకుం టాడు? అన్నది చూడాలి. సాధారణంగా ఇలాంటి సమయంలో చాలా మంది దర్శకులు ఒత్తిడికి గురవు తుంటారు. కానీ సందీప్ రెడ్డి ఆ టైపు కాదు. చినిగి పోవడం కాదు..తగలబెట్టేద్దాం అన్నటైపే.
