వంగా ఎంత ప్లాన్ చేసినా సెట్టవ్వట్లేదుగా..?
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కన్ఫార్మ్ అయినప్పుడు డార్లింగ్ అభిమానులంతా పండగ చేసుకున్నారు.
By: M Prashanth | 4 Aug 2025 8:19 PM ISTసెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కన్ఫార్మ్ అయినప్పుడు డార్లింగ్ అభిమానులంతా పండగ చేసుకున్నారు. ఈ కాంబోకు స్పిరిట్ టైటిల్ అనౌన్స్ చేయగానే , ఈగర్లీ వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతూ ట్రెండ్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉండడంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని అభిమానులు ఎదురుచూస్తుండగా.. ఇటీవల సందీర్ రెడ్డినే స్వయంగా సెప్టెంబర్ లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానకి అవధుల్లేవ్.
అయితే తాజా సమాచారం ప్రకారం.. స్పిరిట్ సెప్టెంబర్ లో కూడా ప్రారంభమయ్యే అవకాశాలు లేనట్లు కనిపిస్తుంది. సందీప్ తాను అనుకున్న కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కించాలని అనుకుంటారు. అందుకు పక్కాగా ప్లాన్ చేస్తారు కూడా. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఈ కారణాల వల్ల స్పిరిట్ సెప్టెంబర్ లో పట్టాలెక్కే ఛాన్స్ లు లేవని తెలుస్తోంది. ఈ సినిమా 2025 డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. తర్వాత సమ్మర్ మే కు షిఫ్ట్ అయ్యింది. అటునుంచి సెప్టెంబర్ అంటుండగా.. తాజాగా డిసెంబర్ దాకా వెళ్లింది.
అయితే సందీప్ కూడా తన సినిమాకు ప్రభాస్ బల్క్ డేట్స్ కావాలని అడిగారట. ఈ సినిమాలో గెటప్ బయటకు రివీల్ కావొద్దని, ప్రేక్షకులలో ఆ హైప్ మెయింటేన్ చేయాలని డైరెక్టర్ భావించారు. అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నారు. అందుకే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ కంప్లీట్ చేసి ఆ తర్వాత స్పిరిట్ కు ఎక్కువ సమయం ఇవ్వడానికి ఒప్పుకున్నారట.
కాగా, అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందీప్ తో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అనగానే అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఈ ప్రాజెక్ట్ చుట్టూ విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఇది చిత్రీకరణ ప్రారభం కాకముందే ఇంత బజ్ తెచ్చుకుంది. ఇక పోస్టర్, టీజర్ ఇలా ఒక్కోటి వస్తుంటే ఫ్యాన్స్ పూనకాలు ఊగిపోవడం పక్కా.
