Begin typing your search above and press return to search.

ప్రభాస్- రిద్ధి శారీ స్టోరీ.. అసలు విషయం ఇదే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ రిద్ధి కుమార్ కాంబినేషన్ లో ఇప్పుడు ది రాజా సాబ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   30 Dec 2025 10:20 AM IST
ప్రభాస్- రిద్ధి శారీ స్టోరీ.. అసలు విషయం ఇదే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ రిద్ధి కుమార్ కాంబినేషన్ లో ఇప్పుడు ది రాజా సాబ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. అటు అభిమానుల్లో.. ఇటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. రిద్ధి కుమార్ తన కో హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తో సందడి చేశారు. ఆ తర్వాత కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతూ.. తాను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చారని రిద్ధి కుమార్ తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఈలలు, చప్పట్లు వినిపించాయి.

అంతే కాదు.. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు తెగ డిస్కస్ చేసుకున్నారు. ప్రభాస్ ఎప్పుడూ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నారా అని మాట్లాడుకున్నారు. ఆమేంటో అంత స్పెషల్ అని కామెంట్లు పెట్టారు. ఇప్పుడు చీర స్టోరీపై రిద్ధి కుమార్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

"దీపావళి తర్వాత రాజా సాబ్ సెట్స్ లో ఫస్ట్ టైమ్ అడుగుపెట్టా. అది అక్టోబర్ 23. ఆ రోజు ప్రభాస్ గారి బర్త్ డే. ఆయన అక్కడే ఉన్నారు. నేను గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. రెండ్రోజుల తర్వాత దీపావళి పార్టీ జరిగింది. మారుతి సర్ నాతో ప్రభాస్ మాట్లాడుతారని చెప్పారు. ఫస్ట్ టైమ్ ఆయనతో కాల్ లో మాట్లాడాను" అని రిద్ధి కుమార్ తెలిపారు.

"ప్రభాస్ తో కాల్ మాట్లాడినప్పుడు నేను ముంబైలో ఉన్నా. ఆ సమయంలో బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పా. ఓకే అన్నారు. నాకు కూడా దీపావళి గిఫ్ట్ ఉందని చెప్పారు. సెట్స్ కు వెళ్లాక.. నేను బుక్ ను గిఫ్ట్ గా తీసుకెళ్లా. అది కర్ణుడు స్టోరీ ఆధారంగా శివాజీ సావంత్ రాసిన మృత్యుంజయ్ బుక్" అని రిద్ధి చెప్పారు.

"నేను కర్ణ నేచర్.. ప్రభాస్ గారి నేచర్ ఒకటే అనుకుంటాను. వారిద్దరూ చాలా సిమిలర్. ప్రభాస్ అంటే రాజు. నేను గిఫ్ట్ ఇవ్వగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. నేను చేసిన పాత్ర బుక్ ఇచ్చానని అన్నారు. ఆ తర్వాత కల్కి చూస్తే అసలు విషయం నాకు అర్థమైంది. రెండూ అలా సింక్ అయ్యాయి. ఇక ప్రభాస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు" అని వెల్లడించారు.

"అది చాలా లవ్లీ. శారీ చాలా బాగుంది. దానిని మూడేళ్లపాటు దాచిపెట్టుకున్నా. ఇప్పుడు రాజా సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కట్టుకున్నా" అని తెలిపారు రిద్ధి. అయితే ఆమెతో ప్రభాస్‌ ఫ్రెండ్‌ షిప్‌ ఇప్పటిది కాదు. రాధేశ్యామ్ లోనూ ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు రాజా సాబ్ లో యాక్ట్ చేశారు.