రాజా సాబ్ జాతర నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందట!
కానీ రాజా సాబ్ టీమ్ మాత్రం ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ను రిలీజ్ చేయడం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 19 Nov 2025 4:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ది రాజా సాబ్. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ కానుండగా ఆ సినిమాలన్నీ ఆల్రెడీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాయి.
రాజా సాబ్ లో 5 సాంగ్స్
కానీ రాజా సాబ్ టీమ్ మాత్రం ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ను రిలీజ్ చేయడం లేదు. ఎప్పటికప్పుడు ఫస్ట్ సింగిల్ ఇదిగో అదుగో అంటున్నారు తప్పించి పాటలను మాత్రం వదలడం లేదు. సాంగ్స్ రెడీ అంటున్నారు కానీ ఎందుకో మేకర్స్ వాటిని రిలీజ్ చేయడంలో తాత్సారం చేస్తున్నారు. రాజా సాబ్ సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉండగా, వాటిలో రెండు సాంగ్స్ ను లిరికల్ వీడియోలతో సహా రెడీ చేశారట.
నెలాఖరు లోపు ఫస్ట్ సింగిల్
ఈ రెండింటిలో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఏ సాంగ్ అయితే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుందని భావిస్తారో దాన్ని ముందుగా రిలీజ్ చేయాలని, ఈ నెలాఖరు లోపే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని కొందరంటుంటే సినిమా ఆల్బమ్ మొత్తాన్ని రెడీ చేసి, ఒకేసారి జ్యూక్ బాక్స్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నరని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ సాంగ్ గురించి ఇప్పుడందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.
తమన్ సంగీతంలో వస్తున్న రాజా సాబ్ లో ఓ జాతర సాంగ్ ఉందని, ఆ సాంగ్ వెండితెరపై నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, రీసెంట్ టైమ్స్ లో ఈ రేంజ్ జాతర సాంగ్ రాలేదని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, స్క్రీన్ పై జాతర సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉందని అంటున్నారు. రాజా సాబ్ సాంగ్స్ విషయంలో మేకర్స్ ఊరిస్తున్నారు తప్పించి వాటిని మాత్రం వదలకపోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది.
