ఆ విషయంలో అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు
కటౌట్ ను చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ డైలాగ్ ప్రభాస్ కు సరిగ్గా సరిపోతుంది. ప్రభాస్ కు కాకుండా వేరే ఏ హీరోకైనా ఈ డైలాగ్ పడి ఉంటే కాస్త ఓవర్ గా అనిపించేదేమో కానీ ప్రభాస్ కు మాత్రం ఈ డైలాగ్ కరెక్ట్ గా యాప్ట్ అయింది.
By: Sravani Lakshmi Srungarapu | 6 Jan 2026 8:00 PM ISTకటౌట్ ను చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ డైలాగ్ ప్రభాస్ కు సరిగ్గా సరిపోతుంది. ప్రభాస్ కు కాకుండా వేరే ఏ హీరోకైనా ఈ డైలాగ్ పడి ఉంటే కాస్త ఓవర్ గా అనిపించేదేమో కానీ ప్రభాస్ కు మాత్రం ఈ డైలాగ్ కరెక్ట్ గా యాప్ట్ అయింది. ప్రభాస్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు, స్క్రీన్ చాలా నిండుగా, హుందాగా ఉంటుంది. అయితే ప్రభాస్ స్క్రీన్ పై గంభీరంగా ఉన్నప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం అతను చాలా సాఫ్ట్, మొహమాటస్థుడు, ఇంకా చెప్పాలంటే అతనికి చాలా సిగ్గు.
అయితే సినిమాల్లో కనిపించే ప్రభాస్‌కీ, రియల్ లైఫ్ లో ఉండే ప్రభాస్ కు చాలా తేడా ఉంటుంది. అందుకే ప్రభాస్ తప్పదు అంటే కానీ అందరి ముందుకీ రారు. మైక్ పట్టుకుని నలుగురి ముందు మాట్లాడాలంటే ఆయనకి ఎక్కడలేని మొహమాటం అడ్డొస్తుంటుంది. అయితే ప్రభాస్ రియల్ లైఫ్ లోనే కాదట, కెరీర్ స్టార్టింగ్ లో షూటింగ్ లొకేషన్ లో కూడా అంతే వ్యవహరించేవారట.
ఆ డైలాగ్ అసలు చెప్పలేదట!
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో మొదట వచ్చిన ఛత్రపతి షూటింగ్ లో ప్రభాస్ బాజీరావుని చంపేశాక అతని శవాన్ని ఈడ్చుకుని వెళ్లి కోట శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చాక ఓ స్పీచ్ ఇస్తారు. అయితే ఆ సీన్ షూటింగ్ టైమ్ లో ప్రభాస్ అసలు డైలాగ్‌లే చెప్పలేదని, కేవలం లిప్ సింక్ మాత్రమే ఇచ్చానని గతంలో ప్రభాస్ వెల్లడించిన విషయం ఇప్పుడు వైరలవుతోంది.
లిప్ సింక్ మాత్రమే ఇచ్చా
ఓ వైపు వర్షం, మరోవైపు జనాన్ని చూశాక, రాజమౌళి దగ్గరకు వెళ్లి డార్లింగ్ డైలాగ్ గట్టిగా చెప్పలేను, సైలెంట్ గా చెప్తాననడంతో రాజమౌళి కూడా ఓకే అన్నారట. ఆ షాట్ లో కేవలం లిప్ సింక్ మాత్రమే ఇచ్చానని, అది చూసి షూటింగ్ లోకేషన్ లో ఉన్న వారికి ఏమీ అర్థం కాలేదని, జనం ఉంటే తాను తెలియకుండానే సైలెంట్ అయిపోతానని చెప్పారు ప్రభాస్.
తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ టైమ్ లో విశ్వనాథ్ గారు సెట్ లో ఉన్నప్పుడు ఇలాగే సైలెంట్ గా డైలాగ్స్ చెప్తే ఇలా అయితే ఎలా, డైలాగ్స్ ఓపెన్ గా చెప్పాలన్నారని తెలిపారు. తనతో వర్క్ చేసిన డైరెక్టర్లందరూ రాజమౌళిని తిట్టుకుంటారని, ఆయన వల్లే నేనిలా డైలాగ్స్ ను చెప్తున్నానంటారని ప్రభాస్ పేర్కొన్నారు. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9న రిలీజవుతున్న సందర్భంగా గతంలో ప్రభాస్ మాట్లాడిన విషయాలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
