Begin typing your search above and press return to search.

అండర్ 18 కోసం ప్రభాస్ వస్తాడా?

ఫస్ట్ న్యాచురల్ స్టార్ నానికి ట్రై చేశారు కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కాల్ కలిపారు.

By:  M Prashanth   |   11 Sept 2026 10:05 AM IST
అండర్ 18 కోసం ప్రభాస్ వస్తాడా?
X

రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే కేటీఆర్ అప్పుడప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో భలే ఎట్రాక్ట్ చేస్తుంటారు. లేటెస్ట్ గా ఆయన అండర్ 18 వరల్డ్ అనే యూట్యూబ్ ఛానెల్ పాడ్ కాస్ట్ కు గెస్ట్ గా వెళ్లారు. అక్కడంతా 18 ఏళ్ల లోపు స్కూల్ పిల్లలే ఉంటారు. వాళ్ళతో కేటీఆర్ సరదాగా ముచ్చటించారు. అదే సమయంలో ఈ పిల్లలు కేటీఆర్ తో ఒక ఫన్ గేమ్ ప్లాన్ చేశారు. కేటీఆర్ ఫోన్ తీసుకుని టాలీవుడ్ స్టార్ కు ప్రాంక్ కాల్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఫస్ట్ న్యాచురల్ స్టార్ నానికి ట్రై చేశారు కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కాల్ కలిపారు. ఆ కాల్ లో ప్రభాస్ మాట వినగానే పక్కన ఉన్న అమ్మాయి ఫోన్ అందుకొని "ఈ ఫోన్ రోడ్డు మీద దొరికింది.. నేను ఎవరితో మాట్లాడుతున్నాను" అని అనగానే ప్రభాస్ వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఫస్ట్ టైమ్ నెట్ వర్క్ ఇష్యూ వల్ల కాల్ కనెక్ట్ కాలేదు. కాసేపటికి మళ్లీ ట్రై చేయగానే ప్రభాస్ లైన్ లోకి వచ్చాడు.

వెంటనే కేటీఆర్ అసలు మేటర్ చెప్పారు. తను ఒక స్కూల్ పిల్లల పాడ్ కాస్ట్ లో ఉన్నానని, వాళ్ళు సరదాగా నీకు ప్రాంక్ చేయాలని నా ఫోన్ తీసుకున్నారని చెప్పారు. ఈ పిల్లలు చాలా కూల్ అని, వీళ్ళతో ఒక పాడ్ కాస్ట్ చేయాలని ప్రభాస్ ను కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు. మేమే స్వయంగా వచ్చి సారీ కూడా చెప్తాము బ్రో అంటూ సరదాగా మాట్లాడారు. ఐతే ఈ వీడియోలో ప్రభాస్ వాయిస్ వినిపించలేదు కానీ, కేటీఆర్ మాటలను బట్టి డార్లింగ్ రియాక్షన్ ఏంటో ఈజీగా అర్థమైపోయింది. ప్రభాస్ కు ఇలాంటి ప్రాంక్ కాల్స్ అంతగా నచ్చవని, కానీ ఆయన చాలా మంచివాడు కాబట్టి సైలెంట్ గా కాల్ కట్ చేశాడని కేటీఆర్ ఆ పిల్లలతో అన్నారు.

కేటీఆర్, ప్రభాస్ మధ్య జరిగిన ఈ ప్రాంక్ కాల్ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇచ్చేది చాలా తక్కువ. కేటీఆర్ అయితే ఆ పిల్లల కోసం ఇంటర్వ్యూకి రావాలని కోరారు. ఈమధ్య అండర్ 18 వరల్డ్ పిల్లలు ప్రముఖ రాజకీయం నాయకులను ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. లోకేష్ , హరీష్ శంకర్ లతో కూడా చిట్ చాట్ చేశారు. ఇక ప్రభాస్ రిక్వెస్ట్ మేరకు వస్తారో లేదో చూడాలి.

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈమధ్య డేట్ మారొచ్చనే ప్రచారం కూడా మొదలైంది. మేకర్స్ నుంచి మాత్రం కొత్త డేట్ ఇంకా రాలేదు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ షూటింగ్ కూడా జరుగుతోంది.

ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. స్పిరిట్ ను 2027 మార్చి 5న రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే చెప్పింది. మధ్యలో వాయిదా రూమర్స్ వచ్చినా ఆ డేట్ లో మార్పు లేదని నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ దగ్గర మరో రెండు పెద్ద సీక్వెల్స్ ఉన్నాయి. నాగ్ అశ్విన్ కల్కి 2 కోసం ఇప్పటికే పది రోజుల షూటింగ్ పూర్తిచేశాడు. ప్రభాస్ డేట్స్ దొరికిన తర్వాత పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తామని నాగ్ అశ్విన్ ఇటీవలే చెప్పాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు.