ఆ ఇద్దరి మధ్య ఫైట్ ఇదే ఫస్ట్ టైమ్!
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఫైటింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎంత కాంపిటీషన్ ఉన్నా? ఆ సీజన్ మాత్రం ఏ హీరో మిస్ చేసుకోడు.
By: Srikanth Kontham | 11 Nov 2025 11:00 PM ISTసంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఫైటింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎంత కాంపిటీషన్ ఉన్నా? ఆ సీజన్ మాత్రం ఏ హీరో మిస్ చేసుకోడు. సినిమా ఎలా ఉన్నా? పండగ సీజన్ కలిసొస్తుంది? అన్న ధీమాతో చాలా మంది స్టార్లు బరిలోకి దిగుతుంటారు. ఈ క్రమంలో పోటీ తప్పదు. ఆ సమయంలో ఏ హీరో కూడా వెనక్కి తగ్గడానికి అంగీకరించరు. ఇప్పటికే చిరంజీవి 157వ సినిమా అదే సీజన్ లో రిలీజ్ అవుతంది. దీంతో పాటు, మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ రేసులో ఉన్నాయి. అయితే ప్రముఖంగా? ఒకే రోజున అంటే జనవరి 9న రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
భారీ హైప్ తో ఆ రెండు:
అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరు కాగా, మరొకరు దళపతి విజయ్. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `రాజాసాబ్` జనవరి 9న రిలీజ్ అవుతుండగా, అదే రోజున విజయ్ నటిస్తోన్న `జన నాయగన్` కూడా రిలీజ్ అవుతుంది. దీంతో ఇద్దరి హీరోల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. `రాజాసాబ్` పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం అంటే అన్ని వర్గాలకు రీచ్ అవుతుంది. ఈసారి మారుతి కథలో డార్లింగ్ భాగం కావడంతో? అంచనాలు ఆకాశాన్నే అంటుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రాలు అంతకంతకు హైప్ పెంచేస్తున్నాయి.
కోలీవుడ్ లో ప్రభాస్ ప్రత్యేకం:
అటు విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం `జన నాయగన్` కావడంతో తమిళ్ లో భారీ హైప్ ఉంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడని సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో తమిళ్ లో డార్లింగ్ విజయ్ ఎలాంటి పోటీ ఇస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ్ లో మిగతా హీరోలందరి కంటే ప్రభాస్ కు క్రేజ్ ఎక్కువే. `బాహుబలి` నుంచి అదే ఇమేజ్ తో డార్లింగ్ సినిమాలు కోలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో తమిళ బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ మార్కెట్ పై ఆసక్తిక చర్చ జరుగుతోంది. అలాగే విజయ్ `వారసుడు` సినిమాతో టాలీవుడ్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
ఇద్దరికీ ఇదే తొలి అనుభవం:
అతడి సినిమాలకు టాక్ పాజిటివ్ గా వచ్చిందంటే? ఇక్కడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈసారి `జన నాయగన్` మరింత ప్రత్యేకం. ఇది ఓ తెలుగు సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. అది సినిమాకు ప్లస్ అవుతుంది. తెలుగు కథలో విజయ్ ఎలా నటించాడు? అన్నది ఆసక్తికర చర్చే. పైగా విజయ్ తమిళనాట పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతో? ఇక్కడా మంచి బజ్ నెలకొంది. చివరి సినిమాతో ప్రేక్షకు ల్ని ఎంతగా ఎంగేజ్ చేస్తాడనే చర్చ జరుగుతోంది. అలాగే ఇంత వరకూ ప్రభాస్-విజయ్ నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవ్వలేదు. ఆ రకంగా ఈ క్లాష్ హీరోలిద్దరికీ తొలి అనుభవంగా చెప్పొచ్చు.
