రాజాసాబ్ ప్రీ రిలీజ్ అమెరికాలోనా!
తెలుగు సినిమా ప్రచారం దేశాలు, ఖండాలు దాటిపోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమా ఈవెంట్లు ఎక్కు హైదరాబాద్ లో జరిగేవి.
By: Srikanth Kontham | 6 Nov 2025 3:02 PM ISTతెలుగు సినిమా ప్రచారం దేశాలు, ఖండాలు దాటిపోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమా ఈవెంట్లు ఎక్కు హైదరాబాద్ లో జరిగేవి. కానీ పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత హైదరాబాద్ తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో..అవసరం అనుకుంటే విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ అవుతుందంటే? దాదాపు మెట్రో పాలిటన్ సిటీస్ అన్నింటిని ప్రచారంలో భాగంగా కవర్ చేస్తున్నారు. టీమ్ తో ఆయా ప్రదేశాల్లో సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
భారీ ఖర్చుతో ఈవెంట్:
అప్పుడప్పుడు అమెరికాలో కూడా ఈవెంట్లు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా `ది రాజాసాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. తెలుగులో కేవలం ప్రెస్ మీట్లతో సరిపెట్టి అమెరికాలో మాత్రం గ్రాండ్ గా ముందొస్తు వేడుక నిర్వహించాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అమెరికాలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించాలని..అందు కోసం ఖర్చు కూడా భారీగా పెడుతున్నట్లు సమాచారం. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా హాజరయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారుట.
ప్రత్యేక కారణం ఏంటో?
అమెరికాలో తెలుగు సినిమా ప్రచారమంటే తెలుగు జనాలంతా తప్పక హాజరవుతారు. విదేశాల్లో ప్రభాస్ నటించిన సినిమా ఈవెంట్లు ఇంత వరకూ విదేశాల్లో పెద్దగా జరగలేదు. భారత్ సహా తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేసుకునే ప్రచారం చేసేవారు. కానీ `రాజాసాబ్` విషయంలో ఆమెరికాలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంటే? ప్రత్యేకమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. `రాజాసాబ్` సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకంగా నిర్వహించిన ఓ ఆన్ లైన్ పోల్ లో` పౌజీ` కంటే `రాజాసాబ్` కే ఎక్కువ ఓట్లు పడ్డాయి.
భారీ ఓపెనింగ్స్ లాంఛనమే:
`రాజాసాబ్` రిలీజ్ ఆలస్యమైనా సినిమాపై బజ్ ఎక్కడా తగ్గలేదు. సినిమా పై ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా లేదు. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజే నడుమ భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే రిలీజ్ ప్లాన్ కూడా సిద్దమవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులన్నింటినీ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
