రాజాసాబ్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
`బాహుబలి`తో యావత్ సినీ ప్రపంచం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసి పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న హీరో ప్రభాస్.
By: Tupaki Entertainment Desk | 17 Dec 2025 3:00 PM IST'బాహుబలి'తో యావత్ సినీ ప్రపంచం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసి పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న హీరో ప్రభాస్. అప్పటి నుంచి పాన్ ఇండియా క్రేజ్‌ని, మార్కెట్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్ అదే స్థాయి ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెడుతూ స్పీడు పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. ప్రతీ ప్రాజెక్ట్ రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తున్నాయి. 'రాజాసాబ్' బిజినెస్ కూడా ఇదే పంథాలో జరిగినట్టుగా తెలుస్తోంది.
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ మూవీ ఇది. మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టి.జి.విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 9న సంక్రాంతి సందర్భంగా పాన్ ఇండియా వైడ్‌గా ఐదు భాషల్లో భారీగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 20రోజులు మాత్రమే ఉంది. స్టార్టింగ్ నుంచి ఈ ప్రాజెక్ట్‌పై భిన్న స్వరాలు వినిపిస్తున్నా బిజినెస్ మాత్రం ప్రభాస్ రేంజ్‌లోనే జరిగిందని తెలిసింది.
ముందు అభిమానుల్లో, సినీ లవర్స్‌లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి తగ్గినా ట్రైలర్ రిలీజ్ తరువాత ఆసక్తి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ట్రైలర్‌లో ప్రభాస్‌ని వింటేజ్ లుక్‌లో చూపించిన తీరు, తన డైలాగ్ డెలివరీ, క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన తీరు ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా భారీ స్థాయిలో అంటే ప్రభాస్ రేంజ్‌లో జరిగినట్టుగా ఇన్ సైడ్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో 'ది రాజా సాబ్' థియేట్రికల్ బిజినెస్ రూ.160 కోట్ల మేరకు జరిగినట్టుగా తెలిసింది.
ఇక ఓవర్సీస్, హిందీ వెర్షన్ మార్కెట్ కలిపి రూ.350 కోట్లు బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాన్ థ్రియేట్రికల్ రైట్స్‌తో కలిపి మొత్తం బిజినెస్ రూ.600 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వింటేజ్ ప్రభాస్ లుక్, అండ్ డైలాగ్స్ డెలివరీ, సంక్రాంతి సీజన్, కామెడీ ఎలిమెంట్స్, తొలి సారి ప్రభాస్ నటించిన కామెడీ హారర్ కావడం ఈ సినిమాకు ప్రధాన ప్లస్ లుగా మారనున్నాయి. ఈ మూవీలో సంజయ్‌దత్, బోయన్ ఇరానీ, జరీనా వాహబ్ లతో పాటు సముద్రఖని, యోగిబాబు, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.
తొలి సారి ప్రభాస్ తన పంథాకు పూర్తి భిన్నంగా చేసిన కామెడీ హీరర్ మూవీ కావడం, సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్‌ని, పిల్లలని ఎంటర్ టైన్ చేసే విధంగా రూపొందడంతో ఎక్కువగా ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే 'ది రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడం ఖాయం.
