రాజా సాబ్ లో ఆ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి
ప్రభాస్. బాహుబలి తర్వాత ఈ పేరుకి ఉన్న క్రేజే మారిపోయింది. అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారంటే అతని ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
By: Sravani Lakshmi Srungarapu | 14 Dec 2025 12:47 PM ISTప్రభాస్. బాహుబలి తర్వాత ఈ పేరుకి ఉన్న క్రేజే మారిపోయింది. అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారంటే అతని ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే క్రేజ్, ఫాలోయింగ్ పెరిగిందని ప్రభాస్ ఎప్పుడూ రిస్క్ కు దూరంగా లేరు. ఇంకా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్ రిస్క్ ఎక్కువ చేస్తున్నారని చెప్పాలి.
కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేసిన డార్లింగ్
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతీ సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్ లో, సరికొత్తగా ఉంటూనే ఆడియన్స్ కు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తుంది. ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆయన చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ ఎవరూ చేయరు కూడా. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు ఓపెన్ గానే చెప్పగా, రీసెంట్ గా ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి కూడా అదే విషయాన్ని చెప్పారు.
ప్రభాస్ కు అలాంటి సినిమాలంటే ఇష్టం
రీసెంట్ గా ఓ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ప్రభాస్ గురించి, ఆయన ఇష్టాల గురించి, రాజా సాబ్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ కు ప్రేమ కథా చిత్రమ్ అనే సినిమా అంటే చాలా ఇష్టమని, ఆ విషయాన్ని తనతో రెండు మూడు సార్లు చెప్పారని, ఆ సినిమాలో ఉండే ఫన్, ఆ ఎలిమెంట్స్ అంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పారన్నారు. తాను ప్రేమ కథాచిత్రమ్ సినిమా చేశాక అదే జానర్ లో దాదాపు అలాంటి సినిమాలు 500కి పైగా వచ్చాయని కూడా మారుతి అన్నారు.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం
ఇక రాజా సాబ్ విషయానికొస్తే ఈ సినిమాలో విలన్ కు, ప్రభాస్ కు మధ్య వచ్చే సీన్స్, డ్రామా కొత్తగా ఉంటే మూవీ కొత్తగా ఉంటుందనిపించిందని, ఆ నమ్మకంతో దానిపై చాలా వర్క్ చేశామని చెప్పిన మారుతి, ది రాజా సాబ్ కోసం ప్రభాస్, తాను చాలా కష్టపడ్డామని, ఈ మూవీ ఆడియన్స్ కు బిగ్ స్క్రీన్ పై సరికొత్త అనుభూతినిస్తుందని చెప్పారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
