రాజా సాబ్.. జస్ట్ అలా కాళ్లు ఊపాడంతే..!
లేటెస్ట్ గా రాజా సాబ్ నుంచి ఒక 14 సెకన్ల క్లిప్ రిలీజైంది. అది కూడా సోషల్ మీడియాలో వదిలారు. అందులో షూస్ వేసుకుని కాళ్లు ఊపుతూ కనిపించారు.
By: Ramesh Boddu | 8 Oct 2025 10:14 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా గురించి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉంటూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ రెబల్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయగా రాజా సాబ్ ప్రతి అప్డేట్ ని ఇలా సోషల్ మీడియాలో వదులుతూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. రెబల్ ఫ్యాన్స్ అయితే ఈ అప్డేట్స్ కోసమే కదా ఇన్నాళ్లు వెయిట్ చేసింది అనేలా ఉన్నారు.
రాజా సాబ్ నుంచి ఒక 14 సెకన్ల క్లిప్..
లేటెస్ట్ గా రాజా సాబ్ నుంచి ఒక 14 సెకన్ల క్లిప్ రిలీజైంది. అది కూడా సోషల్ మీడియాలో వదిలారు. అందులో షూస్ వేసుకుని కాళ్లు ఊపుతూ కనిపించారు. ఐతే అవి కచ్చితంగా ప్రభాస్ వే అంటున్నారు ఫ్యాన్స్. రాజా సాబ్ డైరెక్టర్ మారుతి బర్త్ డే సందర్భంగా ఆ లీక్ ఇచ్చారన్నమాట. థమన్ మ్యూజిక్ అదరగొట్టేస్తున్న రాజా సాబ్ నుంచి నెక్స్ట్ ఒక సాంగ్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ అప్డేట్ కోసం ముందే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కి ఒక హింట్ ఇచ్చారు.
మారుతి సినిమాల్లో సాంగ్స్ కూడా బాగుంటాయి. థమన్ ఈమధ్య వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సో తప్పకుండా రాజా సాబ్ కాన్సెప్ట్, బిజిఎం తో పాటు సాంగ్స్ కూడా అదిరిపోతుందని చెప్పొచ్చు. ప్రభాస్ రాజా సాబ్ సినిమా అసలైతే ఈ ఇయర్ డిసెంబర్ రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఫ్యాన్స్ కోరిక మేరకే సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు.
థ్రిల్లర్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో..
ప్రభాస్ రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. రిలీజైన టీజర్ అయితే సినిమాపై భారీ అంచనాలు తెచ్చింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్నా కొద్దీ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ మేకర్స్ అనౌన్స్ చేస్తారు. మారుతి తొలిసారి ప్రభాస్ ని డైరెక్ట్ చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ టేకింగ్ తో సినిమా చేస్తున్నట్టు ఉన్నారనిపిస్తుంది. ట్రైలర్ తోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ వచ్చేలా చేసిన మారుతి రిలీజ్ వరకు సినిమాకు ది బెస్ట్ వర్క్ అందించేలా ఉన్నాడు.
రాజా సాబ్ సినిమా ప్రభాస్ ని డిఫరెంట్ గా చూపించబోతున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ వరుసగా సీరియస్ కథలే చేస్తూ వస్తున్నాడు. అందుకే రెబల్ స్టార్ తో హ్యూమర్ పండించి అదరగొట్టబోతున్నారని తెలుస్తుంది.
