కన్ఫ్యూజన్స్ కి ట్రైలర్ లో క్లారిటీ.. 'రాజాసాబ్' ఇచ్చిన మూడు షాకులు ఇవే!
ఇన్నాళ్లు ఇది కేవలం ఒక హారర్ కామెడీ సినిమా మాత్రమే అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసాక ఇందులో అంతకు మించిన విషయం ఉందని అర్థమైంది.
By: M Prashanth | 30 Dec 2025 1:08 PM ISTమొదట్లో వచ్చిన 'రాజాసాబ్' టీజర్, ట్రైలర్ చూసి ఆడియెన్స్ కాస్త తికమక పడ్డారు. అసలు డైరెక్టర్ మారుతి ఏం చెప్పాలనుకుంటున్నాడు, కథ ఏంటి అనే విషయంలో ఎవరికీ సరైన క్లారిటీ రాలేదు. రెగ్యులర్ రొటీన్ పాత పద్దతిలోనే వెళతాడా అనే డౌట్స్ కూడా వచ్చాయి. దీంతో సినిమా అవుట్‌పుట్ మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ 2.0 ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది. కేవలం క్లారిటీ ఇవ్వడమే కాదు, ఫ్యాన్స్ కు ఊహించని మూడు షాకులు ఇచ్చింది.
ఇన్నాళ్లు ఇది కేవలం ఒక హారర్ కామెడీ సినిమా మాత్రమే అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసాక ఇందులో అంతకు మించిన విషయం ఉందని అర్థమైంది. సినిమా మీద అప్పటివరకు ఉన్న ఇంప్రెషన్ ని పూర్తిగా మార్చేస్తూ, మూడు ప్రధానమైన అంశాలతో మారుతి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూడు పాయింట్ల గురించే చర్చ జరుగుతోంది.
మొదటిది.. విజువల్ ఎఫెక్ట్స్. టీజర్ లో గ్రాఫిక్స్ మీద చిన్నపాటి నెగిటివ్ టాక్ నడిచింది. కానీ రెండో ట్రైలర్ లో మాత్రం విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ మహల్ సెటప్, దెయ్యం వచ్చే సన్నివేశాలు, లైటింగ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే చాలా రిచ్ గా, గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. బిగ్ స్క్రీన్ మీద ఈ విజువల్ వండర్ కచ్చితంగా ఆడియెన్స్ ని మంత్రముగ్ధులను చేసేలా ఉంది.
ఇక రెండోది.. కథలోని సోల్. ఇది రొటీన్ దెయ్యం కథ కాదని, దీని వెనుక ఒక బలమైన బామ్మ మనవడి ఎమోషన్ ఉందని ట్రైలర్ లో రివీల్ చేశారు. డైలాగ్స్ కథలోని డెప్త్ ని చూపిస్తోంది. తాత గంగమ్మ కాన్సెప్ట్.. ఇక రాజాసాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్.. తాత గురించి లోతుగా తెలుసుకోవాలని ప్రభాస్ ప్రయత్నం చేయడం స్క్రీన్ ప్లే స్ట్రాటజీని హైలెట్ చేసింది. ఈ గ్రిప్పింగ్ గ్రాండ్‌మదర్ గ్రాండ్‌సన్ స్టోరీ సినిమాకు వెన్నెముకగా నిలిచేలా ఉంది. హారర్ కి సెంటిమెంట్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక మూడో విషయం.. వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూడటం. గత కొంతకాలంగా ప్రభాస్ ని సీరియస్ యాక్షన్ రోల్స్ లోనే చూస్తున్నాం. కానీ ఇందులో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రోజుల నాటి లుక్స్ తో ప్రభాస్ మెరిసిపోతున్నారు. ఆ స్టైల్, రొమాంటిక్ యాంగిల్, కూల్ ఆటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజంగా ఇది ఒక వింటేజ్ ప్రభాస్ ట్రీట్ అనే చెప్పాలి. ఏదేమైనా టీజర్ క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ ని ఈ ట్రైలర్ పూర్తిగా చెరిపేసింది. విజువల్స్, సెంటిమెంట్, ప్రభాస్ లుక్స్.. ఈ మూడింటితో సినిమా రేంజ్ పెరిగిపోయింది. సంక్రాంతికి ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా కొట్టబోతున్నారని ఈ ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఫుల్ కంటెంట్ అంచనాలకు ఉంటుందో లేదో చూడాలి.
