ముంబై టు హైదరాబాద్.. ఆ మూవీ కోసం టీమ్ ఆగయా!
టాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.
By: M Prashanth | 26 Aug 2025 3:35 PM ISTటాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. మూవీల అప్డేట్లు, రిలీజ్ డేట్స్ పై రూమర్స్ సహా అనేక విషయాలపై ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటాయి. దాదాపు ప్రతిసారి అవి నిజమవుతూనే ఉంటాయి. ముందు వార్తలు.. ఆ తర్వాత అవే నిజాలుగా మారడం తెలిసిన విషయమే.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. పాన్ ఇండియా హీరో నటిస్తున్న పాన్ ఇండియా ఫన్ మూవీ కోసం ముంబై నుంచి ఓ టీమ్ వస్తుందని సమాచారం. సదరు మూవీ ట్రైలర్ ను కట్ చేయడానికి హైదరాబాద్ కు నేడు చేరుకుంటుందని సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఆ టీమ్ ఏ సినిమా కోసమోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా ఫన్ మూవీ అన్నారు కాబట్టి.. అది రాజాసాబ్ అయ్యి ఉండొచ్చని గెస్ చేస్తున్నారు సినీ ప్రియులు, నెటిజన్లు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో స్టార్ డైరెక్టర్ మారుతి.. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆ మూవీని తెరకెక్కిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా మళ్లీ మొదలైంది. టాలీవుడ్ కార్మికుల సమ్మె వల్ల కొన్ని రోజులపాటు బ్రేక్ పడగా.. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. హైదరాబాద్ లో ఇప్పుడు ప్రభాస్ తో పాటు పలువురు యాక్టర్స్ పై మేకర్స్ కీలకమైన సీన్స్ ను షూట్ చేస్తున్నారని సమాచారం.
ఆ తర్వాత వచ్చే నెలలో మూవీ టీమ్ కేరళ వెళ్లనుందని.. అక్కడ ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించనున్నారని సినీ వర్గాల సమాచారం. మరో రెండు పాటల షూట్ కోసం విదేశాలకు వెళ్లనుండగా ఆ షెడ్యూల్ తో షూటింగ్ కు మేకర్స్ గుమ్మడికాయ కొట్టనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా జెట్ స్పీడ్ లో షూటింగ్ ను పూర్తి చేస్తారని టాక్.
అయితే డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించినా.. సంక్రాంతికి వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తోంది. నిర్మాత విశ్వప్రసాద్ కూడా పరోక్షంగా అదే తెలిపారు. దీంతో ప్రభాస్.. సంక్రాంతి రేసులో దిగుతారని అనుకుంటున్నారు. మరి ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న టీమ్.. రాజాసాబ్ కోసమా లేక వేరే మూవీ కోసమా అన్నది తెలియాల్సి ఉంది.
