ప్రభాస్ రాజాసాబ్.. చర్చంతా క్లైమాక్స్ కోసమే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 2 Jan 2026 6:22 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినా, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం సినిమాపై ఉన్న నెగటివ్ టాక్ ను పూర్తిగా మార్చేసింది.
రాజా సాబ్ ట్రైలర్ కు లభించిన పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాను మళ్లీ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ది రాజా సాబ్ పై చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా ఇప్పుడు సినిమా క్లైమాక్స్ కోసం జోరుగా చర్చ సాగుతోంది. అందుకు కారణం.. ప్రమోషన్స్ లో మారుతి, ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే.
ఓ ఇంటర్వ్యూలో మారుతి.. సినిమాలో క్లైమాక్స్ భాగమే దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందని మారుతి తెలిపారు. సాధారణంగా క్లైమాక్స్ కు ఇంత పెద్ద రన్ టైమ్ ఉండటం అరుదు కావడంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. అదే సమయంలో ప్రభాస్.. మారుతి క్లైమాక్స్ ను పెన్నుతో కాదు, మెషిన్ గన్ తో రాసినట్టుందంటూ ప్రభాస్ ప్రశంసించారు.
స్టార్ హీరో నోట ఇలాంటి కామెంట్ రావడం సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయాయి. నిజానికి.. ప్రభాస్ ఇంతకుముందు ఎప్పుడూ తన సినిమాల క్లైమాక్స్ కోసం ఆ రేంజ్ లో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ మూవీ విషయంలో బహిరంగంగా ప్రశంసలు చేయడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
దీంతో మారుతి ఈసారి ఏం ప్లాన్ చేశాడన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్ లో హాస్పిటల్ సీక్వెన్స్ ఉంటుందని టాక్. ఆ సీన్ లో ప్రభాస్ యాక్టింగ్, మారుతి విజువల్ ట్రీట్మెంట్, సీజీ వర్క్ తో పాటు ఓ కీలక ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కచ్చితంగా క్లైమాక్స్ పై ఫుల్ గా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుందట ఆ సీన్.
ఇక సినిమా మేకింగ్ విషయానికి వస్తే, ది రాజా సాబ్ కు నాలుగు గంటలకు పైగా రా ఫుటేజ్ ఉందని మారుతి వెల్లడించారు. పెద్ద సినిమాలంటే ఎక్కువ షాట్స్ తీస్తామని, కానీ థియేటర్లలో చూసేది మూడు గంటల మూవీ మాత్రమేనని తెలిపారు. కానీ తన దగ్గర మరో గంట నిడివితో ఫుటేజ్ ఉందని, తీసేసిన సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయని మరో ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రభాస్ ప్రతి విషయంలో డీటెయిల్స్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, సినిమా ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని మారుతి తెలిపారు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా భారీగా విడుదల కానుండగా, జనవరి 8న పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేశారు. మరి ప్రభాస్, మారుతి హైప్ క్రియేట్ చేసిన క్లైమాక్స్ ఎంతటి విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి.
