Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'రాజా సాబ్'.. ప్లాన్ మామూలుగా లేదుగా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   13 Dec 2025 8:33 PM IST
ప్రభాస్ రాజా సాబ్.. ప్లాన్ మామూలుగా లేదుగా!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ థ్రిల్లర్ గా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఆ సినిమాతో సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్స్ లోకి రానున్నారు. 2026 జనవరి 9వ తేదీన రాజా సాబ్ గ్రాండ్ గా విడుదల అవ్వనుంది.

సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అంతేకాదు.. సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ ను మేకర్స్‌ కొత్త పుంతలు తొక్కిస్తున్నారని చెప్పాలి. రీసెంట్ గా దర్శకుడు మారుతి ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో రాజా సాబ్‌ రిలీజ్‌ కు ముందు ఆ ప్రపంచంలోకి మీ అందరికీ తీసుకెళ్లబోతున్నామని.. దాన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు.

రాజా సాబ్ వరల్డ్ ఎలా క్రియేట్ చేశాం? దాని వెనుక ఉన్న కష్టం ఏంటి? వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ ఏం జరిగింది? ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఉండే వీడియోను మరికొద్ది రోజుల్లో తీసుకురానున్నామని తెలిపారు. రాజా సాబ్‌ ట్రీట్‌ ఆన్‌ ది వే అంటూ మారుతి అప్పుడు చెప్పగా.. ఇప్పుడు అంతా వీడియో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో పెద్ద ప్లానే వేసినట్లు ఉన్నారని నెటిజన్లు, సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు. అయితే పెద్ద ప్లాన్ కాదు.. నెక్స్ట్ లెవెల్ లో ప్రమోషన్స్ ప్లాన్ ఉండనుందని తెలుస్తోంది. భారీ ప్లాన్ తో మేకర్స్ సిద్ధమయ్యారని సమాచారం. 25 రోజుల ప్లాన్ వేసుకుని రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

అంటే రిలీజ్ కు 25 రోజుల ముందు నుంచి తమ ప్లాన్ ను అమల్లోకి తేనున్నారట. అంటే రేపటి నుండి షురూ అవ్వనున్నట్లు వినికిడి. అందులో భాగంగా ఐమ్యాక్స్ హారర్ వీడియోలతోపాటు ప్రభాస్ కొత్త లుక్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. లెగసీ ఆఫ్ రాజా సాబ్ పేరుతో స్పెషల్ ప్రమోషనల్ సిరీస్ ను కూడా తీసుకురానున్నారు. దీంతో ఇది మామూలు ప్లాన్ కాదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.