Begin typing your search above and press return to search.

రాజా సాబ్ అక్కడ టఫ్ ఫైట్ తప్పదా..?

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది.

By:  Ramesh Boddu   |   13 Sept 2025 9:53 AM IST
రాజా సాబ్ అక్కడ టఫ్ ఫైట్ తప్పదా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ విత్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. రాజా సాబ్ టీజర్ తోనే సినిమా శాంపిల్ చూపించి సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి తెలుగులో చాలా రిలీజ్ లు ఉన్నాయి. మన శంకర వర ప్రసాద్, రవితేజ 76వ సినిమా, శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాలు ప్రభాస్ రాజా సాబ్ కి పోటీ వస్తున్నాయి.

తమిళ్ లోనే రాజా సాబ్..

ఐతే మన దగ్గర ఎన్ని సినిమాలు వచ్చినా ఎవరి ఫ్యాన్ బేస్ వారికి ఉంటుంది కాబట్టి తట్టుకోవచ్చు. సినిమాలు బాగుంటే అన్నిటినీ చూసి హిట్ చేస్తారు మన ఆడియన్స్. ఐతే రాజా సాబ్ కి బాలీవుడ్ లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ ఉందట. ఎటొచ్చి తమిళ్ లోనే రాజా సాబ్ కి కాస్త కష్టమయ్యేలా ఉంది. ఈ సినిమాతో పోటీగా ఆల్రెడీ సంక్రాంతికి దళపతి విజయ్ జన నాయగన్ వస్తుంది. విజయ్ చివరి సినిమా అవ్వడం వల్ల ఈ మూవీపై ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉన్నారు.

ఇక దీనితో పాటు శివ కార్తికేయన్ పరాశక్తి సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. జనవరి 9న జన నాయగన్ వస్తుంటే జనవరి 14న పరాశక్తి రిలీజ్ డేట్ లాక్ చేశారు. రెండు సినిమాల మధ్య ఐదురోజులు గ్యాప్ ఉంది. ఐతే జనవరి 9న రాజా సాబ్ కూడా రిలీజ్ అవుతుంది. మిగతా భాషల్లో ఎలా ఉన్నా తమిళ్ లో మాత్రం రాజా సాబ్ కి ఫైట్ తప్పేలా లేదు. అసలే తెలుగు సినిమాలు తమిళ్ లో అంతగా పర్ఫార్మ్ చేయవన్న టాక్ ఉంది. బాహుబలి, పుష్ప సినిమాలు ఆడాయి మిగతా సినిమాలు అంతగా ఆడలేదు.

థమన్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్..

రాజా సాబ్ కి సోలో రిలీజ్ దక్కితే ఏమో కానీ ఓ పక్క దళపతి విజయ్, మరోపక్క శివ కార్తికేయన్ సినిమా ఎటాక్ చేస్తున్నాయి. కోలీవుడ్ లో రాజా సాబ్ గట్టి పోటీ ఫేస్ చేయబోతుంది. రాజా సాబ్ సినిమా లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. రాజా సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుంది. టీజర్ లోనే థమన్ తన మార్క్ చూపించాడు.