Begin typing your search above and press return to search.

రాజాసాబ్ ఫ్లాప్‌ కు రీజన్స్ అవే.. మళ్లీ ప్రభాస్‌ తో మూవీ: టీజీ విశ్వప్రసాద్

ఒక సినిమా రిజల్ట్ బాగోలేకపోతే అందుకు కారణాలు వెతకడం సహజం. అయితే ఆ తప్పులు ఎక్కడ జరిగాయో నిర్మాతలు ఓపెన్ గా చెప్పడం మాత్రం అరుదుగా కనిపిస్తుంది.

By:  M Prashanth   |   13 Oct 2026 5:57 PM IST
రాజాసాబ్ ఫ్లాప్‌ కు రీజన్స్ అవే.. మళ్లీ ప్రభాస్‌ తో మూవీ: టీజీ విశ్వప్రసాద్
X

ఒక సినిమా రిజల్ట్ బాగోలేకపోతే అందుకు కారణాలు వెతకడం సహజం. అయితే ఆ తప్పులు ఎక్కడ జరిగాయో నిర్మాతలు ఓపెన్ గా చెప్పడం మాత్రం అరుదుగా కనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన ది రాజా సాబ్ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇదే చేశారు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. అంతేకాదు.. 2028లో మళ్లీ ప్రభాస్‌ తో సినిమా చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

ది రాజా సాబ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌ ను కొత్త తరహా పాత్రలో చూడొచ్చనే ఇంట్రెస్ట్ కూడా కనిపించింది. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. ఈ నేపథ్యంలో సినిమా విషయంలో తమవైపు జరిగిన తప్పులను టీజీ విశ్వప్రసాద్ ఒప్పుకున్నారు. గరివిడి లక్ష్మి సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ విషయాలపై మాట్లాడారు.

రాజా సాబ్ రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపిన అంశాల్లో రిలీజ్ టైమింగ్ ముఖ్యమైనదని విశ్వప్రసాద్ చెప్పారు. సినిమా వచ్చిన సీజన్ సరైనది కాదని అభిప్రాయపడ్డారు. మరో సమయంలో రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని అన్నారు. అంటే సినిమా ప్రొడక్షన్, ప్రమోషన్స్ మాత్రమే కాకుండా.. విడుదల తేదీ కూడా ఫలితంపై ప్రభావం చూపుతుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

పెద్ద సినిమాలకు విడుదల తేదీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశం ఉండటంతో పాటు, ఇతర సినిమాల పోటీ, సెలవులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాజా సాబ్’ విషయంలో ఆ లెక్కలు అనుకున్నట్లు కుదరలేదని అర్థమవుతోంది. టికెట్ ధరలు పెంచేందుకు ప్రయత్నించడం కూడా తమకు నెగిటివ్ గా మారిందని ఆయన ఒప్పుకున్నారు. టికెట్ ధరల పెంపు కోసం ప్రయత్నించిన తమ తొలి సినిమా ఇదేనని చెప్పారు. నిజానికి అలా చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

టికెట్ ధరల పెంపు విషయంలో జరిగిన పరిణామాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైందని, అభిమానులు, ప్రేక్షకుల్లో అసహనం పెరిగిందని వివరించారు. సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసినప్పటికీ, మొదటి రోజే ప్రీమియర్ షోలు ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయని విశ్వప్రసాద్ తెలిపారు. విడుదల సమయం, టికెట్ ధరల పెంపు ప్రయత్నం, ప్రీమియర్ షోల ఆలస్యం.. ఇలా పలు అంశాలు రాజా సాబ్ రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపినట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా తెలుగు హక్కులు కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వద్దే ఉన్నాయా, ఆ సినిమాతో రాజా సాబ్ నష్టాన్ని భర్తీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి విశ్వప్రసాద్ స్పందిస్తూ.. స్పిరిట్ సినిమాకు తాను కేవలం డిస్ట్రిబ్యూటర్‌ను మాత్రమేనని స్పష్టం చేశారు. అదే సమయంలో 2028లో మళ్లీ ప్రభాస్‌తో కచ్చితంగా ఓ సినిమా చేస్తామని చెప్పారు. రాజా సాబ్ విషయంలో జరిగిన తప్పులను ఒప్పుకున్న విశ్వప్రసాద్.. ప్రభాస్‌ తో మరో సినిమా ఉంటుందని చెప్పి అభిమానులకు కొత్త అప్డేట్ ఇచ్చారు.