ప్రభాస్ సినిమా.. తెరవెనుక ఏంజరుగుతోంది?
టాలీవుడ్ హీరోల్లో అత్యంత బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. `కల్కి 2898ఏడీ` తరువాత సినిమాల విషయంలో స్పీడు పెంచిన డార్లింగ్ క్రేజీ లైనప్‌తో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు.
By: Tupaki Entertainment Desk | 19 Nov 2025 10:00 PM ISTటాలీవుడ్ హీరోల్లో అత్యంత బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. `కల్కి 2898ఏడీ` తరువాత సినిమాల విషయంలో స్పీడు పెంచిన డార్లింగ్ క్రేజీ లైనప్‌తో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ముందుగా మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `రాజాసాబ్` ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంజయ్‌దత్, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, సముద్రఖని, జరీనా వాహెబ్ వంటి హేమా హేమీలు నటిస్తున్నారు.
ప్రభాస్ మునుపెన్నడూ టచ్ చేయని రొమాంటిక్ హారర్ కామెడీతో కొత్తగా ట్రై చేస్తున్న మూవీ ఇది. జనవరిలో సంక్రాంతికి బరిలోకి దిగుతుందని టీమ్ చెబుతోంది. కానీ అది జరుగుతుందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వినిపిస్తోంది. జనవరి 9న `రాజా సాబ్` థియేటర్లలోకి ఖచ్చితంగా వచ్చేస్తుందని మేకర్స్ చెబుతున్నా రియాలిటీలో మాత్రం అది జరిగేలా కనిపించడం లేదనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి ఈ సినిమా అప్ డేట్‌ల విషయంలో మౌనం పాటిస్తూ వస్తున్న టీమ్ ఆ మధ్య ఎప్పుడో టీజర్‌ని విడుదల చేసింది. ఆ తరువాత సినిమా వస్తుందా?.. అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవుతుందా? ..అసలు షూటింగ్ ప్రోగ్రెస్ ఏంటీ?.. ప్రభాస్ పోర్షన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? అనే కామెంట్‌లు రావడంతో ఫైనల్‌గా ప్రభాస్‌ని రంగంలోకి దించేసి తనకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసింది.
ఆ తరువాత ట్రైలర్ రిలీజ్ చేశారు. అక్కడి నుంచి టీమ్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. టీమ్ చెబుతున్నట్టు జనవరి 9నే రాజసాబ్ థియేటర్లలోకి ల్యాండ్ అవుతాడనుకుంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు తగ్గ ప్రమోషన్స్ ఎక్కడా కనిపించడంలేదని పలువురు వాపోతున్నారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన ప్రధాన డీల్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, అవి పూర్తి కాకుండా సినిమా థియేటర్లలోకి రావడం కష్టమనే గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సర్వత్రా ఇన్ని సందేహాలు వ్యక్తమవుతున్నా నిర్మాత మాత్రం `రాజా సాబ్` ఆరు నూరైనా జనవరి 9నే వస్తుందని చెబుతున్నారు. ఆటైమ్ మిస్సయితే ప్రభాస్ సినిమాలకు ఇబ్బందులు తప్పవు. తన లైనప్ డిస్ట్రబ్ అవుతుందనేది మరి కొదరి వాదన. దీని తరువాత `ఫౌజీ` నుంచి `సాలార్ 2` వరకు వరుస రిలీజ్‌లున్నాయి. వాటి పరిస్థితేంటని అంతా అంటున్నారు. ఇక జనవరి 9నే వస్తే దళపతి విజయ్ చివరి సినిమా `జన నాయగన్` పోటీకి దిగబోతోంది. ఇది పెద్ద పోటీ కాకపోయినా జనవరి 9నే రాజాసాబ్ రావాలంటే ప్రభాస్ చొరవ తీసుకోవాల్సిందే అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. గతంలో తాను నటించిన రెండు మూడు సినిమాల రిలీజ్ విషయంలో చొరవ తీసుకున్న ప్రభాస్ `రాజా సాబ్` రిలీజ్ కోసం కూడా ముందకొస్తారా?.. ఇంతకీ `రాజా సాబ్` ఎందుకు ఆలస్యం అవుతోంది? తెర వెనుక ఏం జరుగుతోంది? అన్నది తెలియాలంటే జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే.
