రాజాసాబ్.. ఆ డీల్ తో డేట్ లీక్?
ప్రభాస్ ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్. మారుతి ఈ సినిమాను కామెడీ హార్రర్ జానర్ లో తెరకెక్కించారు.
By: M Prashanth | 10 Aug 2025 5:00 PM ISTప్రభాస్ ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్. మారుతి ఈ సినిమాను కామెడీ హార్రర్ జానర్ లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేసి.. డిసెంబర్ 05న తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందని వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యిందంటూ ప్రచారం సాగింది.
ఈ ప్రచారంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా స్పందించారు. అందరూ కోరుకుననప్పుడే రాజాసాబ్ వస్తుందని అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేశారని కానీ, దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వప్రసాద్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అయితే డిసెంబర్ 05న రిలీజ్ అంటే నవంబర్ ఆఖరి వారంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వాల్సి ఉంటింది.
దీంతో మేకర్స్ కూడా పునరాలోచనలో పడ్డారట. ఆలోగా పనులు కంప్లీట్ చేయడం కష్టమేనని అనుకుంటున్నారంట. అలాగే సంక్రాతి అడ్వాంటేజ్, సెలవులు అడ్వాంటేజ్ వాడుకోవాలని భావిస్తున్నాట్లు తెలిసింది. ఈ వార్తల వేళ మరో కొత్త డేట్ ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ 05 నుంచి రాజాసాబ్ 2026 జనవరి 09కి షిఫ్ట్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులను పూర్వి పిక్చర్స్ రూ.20 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అలా రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ బయటకు లీక్ అయ్యింది!
దీంతో రాజాసాబ్ సంక్రాతి బరిలో నిలుస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతి ఫైట్ లో మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మెగా157 సినిమా బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మొదట్నుంచీ ఈ సినిమా మేకర్స్ 2026 సంక్రాంతి టార్గెట్ గానే చేస్తున్నారు. ఈ లెక్కన 2026 సంక్రాంతి బరిలో రాజాసాబ్ వర్సెస్ మెగా 157 ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
ఈ రెండు సినిమాలే కాదు ప్రస్తుతం మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతి వైపే చూస్తున్నాయి. నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే రవితేజ- తిరుమల కిషోర్ కాంబోలోనూ ఓ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం చకచకా షూటింగ్ నడుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ఉండాలని భావిస్తున్నాయి. చూడాలి మరి. ఈ రేస్ లో ఫైనల్ గా ఎందరు ఉంటారు? ఎవరైనా డ్రాప్ అవుతారా ? ఇంకా కొత్తగా ఎవరైనా వస్తారా చూడాలి
