రాజా సాబ్ కోసం అదిరిపోయే ప్లాన్!
ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ ను పూర్తి చేస్తున్న డార్లింగ్, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే పీరియాడిక్ డ్రామాను చేస్తున్న విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 9 Sept 2025 5:57 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ ను పూర్తి చేస్తున్న డార్లింగ్, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే పీరియాడిక్ డ్రామాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండింటిలో రాజా సాబ్ సినిమా ముందు ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఏ మాత్రం అంచనాల్లేకుండా మొదలైన రాజా సాబ్
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్ లోనే మొదటి సారి హార్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో చేస్తున్న సినిమా రాజా సాబ్. వాస్తవానికి ఈ సినిమాపై మొదట్లో ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు కానీ తర్వాత్తర్వాత సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ వచ్చాక రాజా సాబ్ పై అంచనాలు పెరిగాయి.
కాంతార1తో రాజా సాబ్ ట్రైలర్
రాజా సాబ్ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, రిలీజ్ కు మరో మూడు నెలల ముందు నుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చూస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఓ అద్భుతమైన ప్లాన్ ను వేశారు. రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్1 కు రాజా సాబ్ ట్రైలర్ ను ఎటాచ్ చేయనున్నట్టు రీసెంట్ గా చిత్ర నిర్మాత టి.జి విశ్వప్రసాద్ తెలిపారు.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్
ఓ రకంగా చెప్పాలంటే ఇది చాలా మంచి ప్లాన్. ఎందుకంటే కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార: చాప్టర్1 సినిమా భారీగా రిలీజవుతుంది. ఈ సినిమాతో పాటూ రాజా సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. దీంతో పాటూ రాజా సాబ్ ఫస్ట్ లిరికల్ ను ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని కూడా సన్నాహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
