Begin typing your search above and press return to search.

రాజా సాబ్ 'ప్రభాస్'.. హైప్ మరో లెవెల్ కు వెళ్తుందా?

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   26 Dec 2025 8:10 PM IST
రాజా సాబ్ ప్రభాస్.. హైప్ మరో లెవెల్ కు వెళ్తుందా?
X

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కామెడీ హారర్ థ్రిల్లర్ గా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 9వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల అవ్వనుంది.

అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అంతాా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో త్వరలో ఆ కార్యక్రమం ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లోనే ఓపెన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నామని కూడా అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా డిసెంబర్ 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని మేకర్స్ తెలిపారు. హైదరాబాద్ లో రేపు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవ్వనుందని వెల్లడించారు. కానీ వెన్యూ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ప్రజలకు ముందు వస్తుండడంతో.. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్.. జనాల ముందుకు వచ్చి చాలా నెలలు అయింది. కాబట్టి కచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రానున్నారు. వేదికపై ప్రభాస్ ఏం మాట్లాడుతారోనని అంతా ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో డార్లింగ్ రావడంతోపాటు ఇచ్చే స్పీచ్ తో సినిమాపై హైప్ మరో లెవెల్ కు చేరే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి సినిమాపై అంచనాలు ఉన్నా.. ప్రభాస్ చిత్రాల రిలీజ్ కు ముందు ఎప్పుడూ క్రియేట్ అయ్యే బజ్ మాత్రం ఇప్పుడు లేదు. డార్లింగ్ నటించిన మూవీ వస్తుందంటే చాలు.. సందడి బీభత్సంగా ఉంటుంది.

కానీ ఇప్పుడు ది రాజా సాబ్ విషయంలో అది కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు సరైన ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవ్వలేదు. ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ ను మేకర్స్ విడుదల చేసినా.. అవి అభిమానులను ఫుల్ గా మెప్పించాయి. కానీ మిగతా ఆడియన్స్ ను మాత్రం సో సో అన్నట్లుగానే అలరించాయి.

అందుకే సినిమాపై ఇప్పుడు నార్మల్ హైప్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ప్రభాస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాక.. అది భారీగా పెరిగే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. ఈవెంట్ లో భాగంగా సూపర్ ప్రమోషనల్ కంటెంట్ ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఈవెంట్ తర్వాత ఎంతటి హైప్ క్రియేట్ అవుతుందో వేచి చూడాలి.