Begin typing your search above and press return to search.

'రాజా సాబ్' ఓవర్సీస్ హవా.. వేటకి ప్రభాస్ రెడీ!

టాలీవుడ్‌లో ఈసారి సంక్రాంతి చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా వేటికవే డిఫరెంట్ జానర్స్.

By:  M Prashanth   |   7 Jan 2026 9:58 AM IST
రాజా సాబ్ ఓవర్సీస్ హవా.. వేటకి ప్రభాస్ రెడీ!
X

టాలీవుడ్‌లో ఈసారి సంక్రాంతి చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా వేటికవే డిఫరెంట్ జానర్స్. ఇక రాజాసాబ్ చిత్రంపై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ కోసం మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'రాజా సాబ్' ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. విదేశాల్లోని తెలుగు ఆడియన్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున థియేటర్లను కేటాయించారు. ఇప్పటికే అక్కడ సినిమా సందడి మొదలవగా, లేటెస్ట్ గా విడుదలైన ఒక అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

అసలు విషయానికొస్తే.. ఓవర్సీస్ పంపిణీ సంస్థ 'ప్రత్యంగిర సినిమాస్' సినిమా విడుదలకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. విదేశాల్లోని అన్ని థియేటర్లకు సినిమా కంటెంట్‌తో పాటు డిజిటల్ కీస్ కూడా పంపించినట్లు స్పష్టం చేసింది. దీనివల్ల ఎక్కడా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ప్రీమియర్ షోలు సజావుగా సాగే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ లొకేషన్లకు ఈరోజు కంటెంట్ చేరుకోగా, హార్డ్ డ్రైవ్ ద్వారా సినిమా ప్రదర్శించే చోట్లకు రేపు ఉదయానికల్లా డ్రైవ్‌లు చేరుతాయని పంపిణీ సంస్థ తెలిపింది. 'లాక్డ్ అండ్ లోడెడ్' అంటూ ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో విదేశాల్లో సినిమా షోలకు ఉన్న లైన్ క్లియర్ అయిపోయినట్లేనని అర్థమవుతోంది.

అమెరికాలో జనవరి 8న గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, టికెట్ సేల్స్ కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్స్, మారుతి కామెడీ టైమింగ్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్లుగా భావిస్తున్నారు. షోలు ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఫైనల్ గా 'రాజా సాబ్' ఓవర్సీస్ రికార్డుల వేట మొదలుపెట్టడానికి సిద్ధమైపోయింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.