Begin typing your search above and press return to search.

ఆదిపురుష్‌నే తట్టుకున్న డార్లింగ్ కు ఇదొక లెక్క..

ఆదిపురుష్ లాంటి భారీ డిజాస్టర్ సమయంలోనే ప్రభాస్ ఇమేజ్ దెబ్బతింటుందని చాలా మంది భావించారు, కానీ వెయ్యి కోట్లతో ‘కల్కి’ తో ఆయన ఇచ్చిన కౌంటర్ కి అందరి నోళ్లు మూతపడ్డాయి.

By:  M Prashanth   |   11 Feb 2026 10:42 AM IST
ఆదిపురుష్‌నే తట్టుకున్న డార్లింగ్ కు ఇదొక లెక్క..
X

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరెక్ట్ కంటెంట్ పడితే డార్లింగ్ రికార్డులల దరిదాపుల్లో ఎవరు ఉండరు. అయితే ఈ మధ్య కాలంలో 'రాజాసాబ్' సినిమా రిజల్ట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో రిలీజ్ అయ్యాక వస్తున్న కొన్ని నెగెటివ్ కామెంట్స్ ఫ్యాన్స్ ను కాస్త డిస్టర్బ్ చేస్తున్నాయి.

సినిమా అన్నప్పుడు హిట్ ఫ్లాపులు చాలా కామన్. ప్రభాస్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరో విషయంలో అంచనాలు ఎప్పుడూ హై రేంజ్ లోనే ఉంటాయి. ఆ అంచనాలు కొంచెం అటు ఇటు అయినా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోతుంటాయి. ఇప్పుడు కూడా 'రాజాసాబ్' ఎఫెక్ట్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ 'ఫౌజీ' మీద పడుతుందేమో అని కొందరు పిచ్చి లెక్కలు వేస్తున్నారు. ప్రభాస్ తదుపరి సినిమాలపై ఈ ప్రభావం ఉంటుందని ఊహిస్తున్న వారికి డార్లింగ్ ట్రాక్ రికార్డ్ తెలియదని చెప్పాలి.

ఆదిపురుష్ లాంటి భారీ డిజాస్టర్ సమయంలోనే ప్రభాస్ ఇమేజ్ దెబ్బతింటుందని చాలా మంది భావించారు, కానీ వెయ్యి కోట్లతో ‘కల్కి’ తో ఆయన ఇచ్చిన కౌంటర్ కి అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వబోతోందని ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు. రాజసాబ్ ఓ ఫ్లాప్ సినిమా కావచ్చు, కానీ ప్రభాస్ మాస్ పవర్ ని అది ఏమాత్రం తగ్గించలేదు. డార్లింగ్ కు ఇదొక చిన్న లెక్క మాత్రమే. ఒకే ఒక్క సాలిడ్ హిట్ పడితే ఈ ట్రోల్స్ అన్నీ గాలికి కొట్టుకుపోతాయని ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ని చూస్తేనే అర్థమవుతోందని మరికొందరు చెబుతున్నారు.

హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' పై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. హను ఎమోషన్స్ ని డీల్ చేయడంలో దిట్ట. పీరియడ్ స్పై వార్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఒక ఊహించని రేంజ్ లో ఉంటుందని టాక్. ఫస్ట్ టీజర్ నుంచే ఈ సినిమా తన సత్తా ఏంటో చూపిస్తుందని, బజ్ మోత మోగాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎమోషనల్ కనెక్షన్ గనుక పక్కాగా కుదిరితే, ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ రికార్డులు తిరగరాయడం ఖాయం.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' సినిమా కూడా లైన్ లో ఉంది. ఒకవేళ స్పిరిట్ గనుక ముందే వచ్చి ఉంటే ఈ సీన్ వేరేలా ఉండేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఏ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రభాస్ మార్కెట్ కు వచ్చే డ్యామేజ్ ఏమీ ఉండదు. 'ఆదిపురుష్' టైమ్ లో వచ్చిన నెగిటివిటీ కంటే ఇది చాలా తక్కువ. అప్పుడే తట్టుకుని నిలబడ్డ డార్లింగ్ కు, ఇప్పుడు ఈ చిన్నపాటి విమర్శలు అసలు లెక్కలోకే రావని ఫ్యాన్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ కు ఉన్న నేషనల్ వైడ్ మార్కెట్ ని అండర్ ఎస్టిమేట్ చేయలేం. 'రాజాసాబ్' ఫ్లాప్ అనేది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. త్వరలోనే 'ఫౌజీ' లేదా 'స్పిరిట్' తో ప్రభాస్ మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపించడం పక్కా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.