నెల లోపే ఓటీటీలోకి రాజాసాబ్
ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ప్రభాస్, అందులో భాగంగానే రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 30 Jan 2026 7:03 PM ISTప్రభాస్ కు కేవలం టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో అతనికి విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత డార్లింగ్ ఫేమ్ బాగా పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత నుంచి ప్రభాస్ చేసిన జానర్ లో సినిమాలు చేయకుండా ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. అన్నీ రకాల కథలను చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
రాజా సాబ్ కు మిక్డ్స్ రెస్పాన్స్
ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ప్రభాస్, అందులో భాగంగానే రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేశారు. సంక్రాంతి కానుకగా రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 9న రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించారని మారుతిని ప్రశంసించినప్పటికీ, కథ, స్క్రీన్ ప్లే విషయంలో అతను చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు.
ప్రభాస్ క్రేజ్ తో డీసెంట్ కలెక్షన్లు
రాజా సాబ్ లో మారుతి మార్క్ కామెడీ మిస్ అయిందని కొందరు, సినిమా కథకు కనెక్ట్ కాలేదని మరికొందరు, హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ ఆశించిన విధంగా లేవని ఇంకొందరు విమర్శించారు. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్, సంక్రాంతి సెలవుల వల్ల ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గానే కలెక్ట్ చేసింది.
సోషల్ మీడియాలో రాజా సాబ్ పై భారీ నెగిటివిటీ
ది రాజా సాబ్ మూవీ ఓ వర్గం ఆడియన్స్ ను అలరించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీపై బాగా నెగిటివిటీ నెలకొంది. ఇదిలా ఉంటే ది రాజా సాబ్ ఇప్పటికే థియేటర్ రన్ ను ముగించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసే వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ఆ అప్డేట్ ను ఇచ్చేసింది.
ఫిబ్రవరి 6 నుంచి ఓటీటీలోకి రాజా సాబ్
రాజా సాబ్ మూవీ ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్టు అఫీషియల్ గా వెల్లడించింది. సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓ స్టార్ హీరో సినిమా, అది కూడా ప్రభాస్ సినిమా ఓటీటీలోకి రావడం విశేషమనే చెప్పాలి. తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో కూడా రాజాసాబ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. రీసెంట్ గా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైనా ఓటీటీలోకి వచ్చాక మంచి వ్యూస్ తో పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటున్న నేపథ్యంలో రాజా సాబ్ కూడా ఆ లిస్ట్ లోకి చేరుతుందేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. సంజయ్ దత్ విలన్ గా నటించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు.
