ఈ సారి డార్లింగ్ పార్టీ ఎక్కడంటే..
ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ ను చేస్తున్న డార్లింగ్, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 4 Oct 2025 6:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ ను చేస్తున్న డార్లింగ్, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో ది రాజా సాబ్ సినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రభాస్ దాదాపు ఓ కొలిక్కి తీసుకు వచ్చారు.
రాజా సాబ్ కోసం గ్రీస్‌కు డార్లింగ్
ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ లో భాగంగానే ప్రభాస్ గ్రీస్ వెళ్లారు. రీసెంట్ గా రాజా సాబ్ సినిమాను చూసుకున్న ప్రభాస్ ఫుల్ శాటిస్‌ఫై అయ్యారని, ఆ సంతృప్తితోనే బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేయాలని గ్రీస్ వెళ్లారని సమాచారం. గ్రీస్ లో రాజా సాబ్ లోని రెండు పాటలను షూట్ చేయనున్నారని, ఆ రెండు పాటలతో రాజా సాబ్ కు సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తైపోతుందని అని తెలుస్తోంది.
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు
అయితే అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టిన రోజనే విషయం తెలిసిందే. రాజా సాబ్ షూటింగ్ కోసం గ్రీస్ వెళ్లిన ప్రభాస్, ఈసారి తన బర్త్ డే ను ఇటలీలోనే సెలబ్రేట్ చేసుకోనున్నారని, ప్రభాస్ తిరిగి ఇండియా వచ్చేది రాజా సాబ్ షూటింగ్ పూర్తయ్యాకే అని తెలుస్తోంది. కాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని నిర్మాత ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
భారీ అంచనాలతో వస్తున్న రాజా సాబ్
ఇక రాజా సాబ్ సినిమా విషయానికొస్తే, పెద్దగా అంచనాల్లేకుండా మొదలైన ఈ సినిమా తర్వాత్తర్వాత అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ ను మారుతి వింటేజ్ లుక్ లో చూపిస్తుండటంతో పాటూ రాజా సాబ్ లో డార్లింగ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండటం మరియు ఈ సినిమా హార్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
