థ్రిల్లర్ సీరీస్ లకు కేరాఫ్ టైటిల్..?
ఈ మధ్య కొన్ని సినిమాలు.. కొన్ని టైటిల్స్ ఇలా ఫ్రాంచైజీలుగా ఒక సెపరేట్ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి.
By: Ramesh Boddu | 7 Aug 2025 9:27 AM ISTఈమధ్య కొన్ని సినిమాలు.. కొన్ని టైటిల్స్ ఇలా ఫ్రాంచైజీలుగా ఒక సెపరేట్ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ఒక సినిమా హిట్ పడగానే ఆ టైటిల్ కి కొంత క్రేజ్ వస్తుంది. ఇక దాన్నే సీక్వెల్స్ గా చేస్తూ అదే జోనర్ కథలను చెప్పబోతున్నారు. ఇదొక కొత్త రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో స్టార్ సినిమాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలా మార్కెట్ లో బజ్ క్రియేట్ చేయాలి అన్న ఆలోచన మేకర్స్ లో ఉంది. అందులో భాగంగానే హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఒక స్టార్ సినిమాకు మంచి టైటిల్ ఫిక్స్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్..
ఇప్పుడు ఆ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు నిర్మాత. ఐతే పార్ట్ 2 అంటే అది కథకు సీక్వెల్ కాదు. ఆ జోనర్ ను కొనసాగించే టైటిల్ అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ అని తెలుస్తుంది. ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా కోసం మారుతి రేయింబవళ్లు కష్టపడుతున్నాడు.
ఐతే నిన్నటిదాకా ఈ సినిమా కేవలం ఒక పార్ట్ అనుకోగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ లేటెస్ట్ గా రాజా సాబ్ 2 కూడా వస్తుందని షాక్ ఇచ్చారు. ఐతే పార్ట్ 2 కథ వేరు ఉంటుందని అన్నారు. అంటే ప్రభాస్ రాజా సాబ్ లో ఈ కథ ముగుస్తుంది. రాజా సాబ్ 2 లో మరో కొత్త కథ.. కొత్త సెటప్ తో వస్తారు. రాజా సాబ్ టైటిల్ బాగుంది కాబట్టి దాన్ని అలా వదిలేయకుండా మేకర్స్ ఇలా థ్రిల్లర్ కథలకు కేరాఫ్ టైటిల్ అయ్యేలా రాజా సాబ్ ఫ్రాంచైజీలుగా ప్లాన్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో ఎలాంటి ఎక్స్ పెరిమెంట్ అయినా..
ఐతే రాజా సాబ్ 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. మరి అందులో ప్రభాస్ ఉంటాడా మరో హీరో వస్తాడా అన్నది చూడాలి. టాలీవుడ్ లో ఎలాంటి ఎక్స్ పెరిమెంట్ అయినా చేసే ఛాన్స్ ఉంది. మన సినీ లవర్స్ నిజంగానే ఆ ప్రయోగాలను ఇష్టపడతారు. సో రాజా సాబ్ 2 ఉంటే మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈమధ్య వరుస క్రేజీ సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలు చేస్తున్నారు. ఐతే ఈ సినిమాల్లో ఏది ఆశించిన సక్సెస్ అందుకోలేదు. అందుకే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలంతా కూడా రాజా సాబ్ మీద గురి పెట్టుకుని ఉన్నారు.
